బాలయ్య హీరోయిన్ కి ‘టైటానిక్’ జేమ్స్ దర్శకత్వంలో చాన్స్?
'నీ ఫిజిక్ భలే బాగుంది.."అని హాట్ గాళ్ లక్ష్మీరాయ్ ని అభినందించింది ఎవరో కాదు.. ప్రపంచ ప్రసిద్ధి పొందిన 'టైటానిక్" దర్శకుడు జేమ్స్ కామరూన్. ప్రస్తుతం ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్ లాల్ సరసన లక్ష్మీరాయ్ 'అరబియుమ్ ఒట్టకవుమ్, పి మాధవన్ నాయిరుమ్" అనే మలయాళ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల దుబాయ్ లో జరిగింది. కాగా.. దుబాయ్ లో జరిగిన '2011 అబుదాబి మీడియా సమ్మిట్" కార్యక్రమంలో పాల్గొన్నారు కామరూన్. ఆయన అక్కడున్న సంగతి తెలుసుకుని.. ప్రియదర్శన్ స్వయంగా వెళ్లి విందుకు ఆహ్వానించారు.
'విందుకు రాలేను కానీ.. మీ షూటింగ్ లొకేషన్ కి వస్తా" అని మాటిచ్చారట కామరూన్. ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటూ ఓ రోజు ఆయన లొకేషన్ కి వెళ్లి.. కాసేపు ముచ్చట్లు చెప్పారట. ఆ సమయంలో లక్ష్మీరాయ్ కి కామరూన్ తో పరిచయం అయ్యింది. ఈ బ్యూటీ గురించి కామరూన్ ఇంటర్నెట్ లో అన్ని విశేషాలు చదివి.. ఇంప్రెస్ అయ్యారట. ఈ సందర్భంగానే పై విధంగా అభినందించడంతోపాటు.. 'నీతో కలిసి సినిమా చేయాలనుకుంటున్నాను" అని కూడా కామరూన్ అన్నారట.
ఈ విషయం గురించి లక్ష్మీరాయ్ చెబుతూ 'నా ఫిజిక్ ని కామరూన్ ప్రశంసించడం ఆనందంగా ఉంది. ఆయనతో కలిసి చేయబోయే సినిమా గురించి చర్చించడానికి త్వరలో కాలిఫోర్నియా వెళ్లనున్నాను" అన్నారు. ఒకవేళ చర్చలు సఫలమై కామరూన్ దర్శకత్వంలో నటించే అవకాశం లక్ష్మీరాయ్‌కి వస్తే..కచ్చితంగా అది సువర్ణావకాశం అని చెప్పొచ్చు. ప్రస్తుతం తెలుగులో ఆమె బాలకృష్ణ సరసన ఓ చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే.


Click it and Unblock the Notifications











