Avengers: Endgame sets fire: అవతార్‌, టైటానిక్‌ రికార్డులపై గురి..2 లక్షల కోట్లు కొల్లగొట్టనుందా?

Recommended Video

Can Avenger Endgame Breaks The Record Of Avatar And Titanic..?? || Filmibeat Telugu

ప్రపంచ సినిమా చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా బాక్సాఫీస్ వద్ద భీకర పోరుకు శుక్రవారం (ఏప్రిల్ 26న) తెర లేవనున్నది. రికార్డుస్థాయి స్క్రీన్లలో భారీగా అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రం రిలీజ్ కానున్నది. మార్వెల్ సీక్వెల్స్‌లో 22వదిగా, అవెంజర్స్ సీక్వెల్స్‌లో 4వదిగా రాబోతున్న ఈ చిత్రం కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నది. ఈ సినిమా ఊపును చూస్తుంటే అవతార్, టైటానిక్ నెలకొల్పిన బాక్సాఫీస్ రికార్డులను తిరుగరాయడం ఖాయమనే మాట వినిపిస్తున్నది. వివరాల్లోకి వెళితే..

అవతార్, టైటానిక్ రికార్డులు ఇవే

అవతార్, టైటానిక్ రికార్డులు ఇవే

ఇప్పటి వరకు ప్రపంచ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం అవతార్. ఈ చిత్రం 278 కోట్ల ($2,787,965,087) డాలర్లు అంటే 1 లక్ష 94 వేల కోట్లు వసూలు చేసింది. భారత్‌లోనే ఈ చిత్రం రూ.200 కోట్లు వసూలు చేయడం గమనార్హం. ఆ తర్వాత స్థానంలో టైటానిక్ 218 కోట్ల డాలర్లు ($2,187,463,944) అంటే లక్షా 52 వేల కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ వసూళ్లను అవెంజర్స్: ఎండ్‌గేమ్ అధిగమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనేది ట్రేడ్ వర్గాల అంచనా.

రికార్డు థియేటర్లు, స్క్రీన్ల సంఖ్యతో

రికార్డు థియేటర్లు, స్క్రీన్ల సంఖ్యతో

అమెరికా, కెనడాల్లో అవెంజెర్స్: ఎండ్ గేమ్ 4600కు పైగా థియేటర్ల రిలీజ్ కానుంది. అధికంగా రిలీజ్ అవుతూ సరికొత్త రికార్డును సృష్టించేందుకు సిద్దమైంది. భారత్‌లో కూడా బాలీవుడ్‌ చిత్రాలకు ధీటుగా అత్యధిక థియేటర్లలో అవెంజెర్స్ విడుదలవతున్నది. ఈ చిత్రం దేశంలోని 100 నగరాల్లో 1000కి పైగా స్క్రీన్లలో ప్రదర్శింపబడనున్నది. తెలుగు రాష్ట్రాల్లోనే ఐదు వందలకు పైగా థియేటర్లలో ప్రదర్శితం కానుంది.

 5 లక్షల టికెట్ల అమ్మకాలు

5 లక్షల టికెట్ల అమ్మకాలు

తొలి మూడు రోజులకే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 5 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి. వారాంతానికి దాదాపు 74 శాతం టికెట్లు అమ్ముడుపోయాయి. ఎక్కువగా ఢిల్లీ, నోయిడా, ముంబై నగరాల్లో మంచి రెస్పాన్స్ కనిపిస్తున్నది అని ట్రేడ్ అనలిస్టులు వెల్లడించారు. తొలి రోజు రూ.50 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది.

 భారత్‌లో రికార్డు కలెక్షన్లతో

భారత్‌లో రికార్డు కలెక్షన్లతో

మొదటి రోజే అవెంజెర్స్: ఎండ్ గేమ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల డాలర్లు వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయేతర చిత్రంగా రికార్డు నెలకొల్పే అవకాశం లేకపోలేదు. భారత్‌లో ఈ చిత్రం రూ.250 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తాజాగా అవెంజర్స్ చిత్రం మొత్తంగా రూ.228 కోట్లు వసూలు చేసింది.

అవెంజెర్స్ @24x7 షోలు

అవెంజెర్స్ @24x7 షోలు

భారత్‌లో అవెంజెర్స్: ఎండ్‌గేమ్ చిత్రానికి ముంబైలో అడ్వాన్స్ బుకింగ్‌కు సంబంధించి కొత్త స్లాట్‌ను ఓపెన్ చేశారు. కార్నివాల్ ఐమాక్స్ వాడాలా (ముంబై) అవెంజర్స్: ఎండ్ గేమ్ చిత్రాన్ని ఉదయం 3.20 గంటల షోను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం అనుమతులు కూడా తీసుకొన్నట్టు తెలుస్తున్నది. మిడ్‌నైట్ తర్వాత స్పెషల్ షోను ప్రదర్శించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం అని ముంబై థియేటర్ ఓనర్లు వెల్లడించారు.

 3డీ, 4డీఎక్స్ ఫార్మాట్స్

3డీ, 4డీఎక్స్ ఫార్మాట్స్

అవెంజర్స్: ఎండ్ గేమ్ సినిమా సరికొత్త టెక్నాలజీతో ప్రేక్షకులకు చక్కటి అనుభూతిని పంచబోతున్నది. ఈ చిత్రాన్ని ఐమాక్స్, 4డీఎక్స్, 3డీ 4డీఎక్స్ వెర్షన్లలో ప్రదర్శించనున్నారు. భారత్‌లోని పలు నగరాల్లో ఈ టెక్నాలజీని కొన్ని థియేటర్లు సమకూర్చుకొంటున్నాయి. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఉత్సాహంతో ఎదురుచూస్తుండటంతో ఈ మేరకు సాంకేతిక మార్పులు థియేటర్లలో చోటుచేసుకొంటున్నాయి.

థానోస్ వర్సెస్ సూపర్ హీరోలు

థానోస్ వర్సెస్ సూపర్ హీరోలు

అవెంజెర్స్: ఎండ్ గేమ్ చిత్రంలో సూపర్ విలన్ థానోస్ చేసే చారిత్రాత్మక పోరాటంపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐరన్ మ్యాన్, థోర్, కెప్టెన్ అమెరికాతో థానోస్ తలపడే పోరాటాల కోసం ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చే 22వ సినిమా. గత నెల కెప్టెన్ మార్వెల్ రిలీజ్ తర్వాత ఈ చిత్రం వస్తుండటంతో మంచి క్రేజ్ ఏర్పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X