»   » ఒక్క రోజుకి 4 లక్షలా?? అవికా లో ఎంతమార్పు.. ఈఫొటోలు చూస్తే షాకే....

ఒక్క రోజుకి 4 లక్షలా?? అవికా లో ఎంతమార్పు.. ఈఫొటోలు చూస్తే షాకే....

Posted By:
Subscribe to Filmibeat Telugu

  తెలుగు తెరపై మెరిసిన కుర్రకథానాయికల జాబితాలో అవికా గోర్ పేరు కూడా కనిపిస్తుంది. 'ఉయ్యాలా జంపాలా' .. 'సినిమా చూపిస్త మావ' వంటి హిట్స్ ఆమె ఖాతాలో వున్నాయి. ఆ తరువాత ఈ అమ్మాయి కొంత గ్యాప్ తీసుకుని అమెరికా వెళ్లింది. అక్కడ డైరెక్షన్లో డిప్లొమా చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా అందరి మనసులను గెలుచుకుంది అవికా గోర్. ఆ బుల్లితెర క్రేజ్‌తోనే 'ఉయ్యాల జంపాల'తో వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత కొన్ని వరుస అవకాశాలు వచ్చినా వదులుకుంది. తదుపరి ఆమె చేసిన సినిమా 'సినిమా చూపిస్త మావ'. రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి పేరు తెచ్చుకుంది.

  అంతకుముందు నాగశౌర్య హీరోగా 'లక్ష్మీ రావే మా ఇంటికి' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ మూడు సినిమాల తర్వాత ఆమె జోరు బాగా తగ్గిపోయింది. కొంచెం లావైపోవడంతో యువ హీరోలు ఆమె వైపు చూడడం కూడా లేదు. దాంతో కాస్త రూటు మార్చింది... వెంటనే బరువు తగ్గింది ఏదో సర్జరీ కూడా చేయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు వచ్చిన వార్త మరింత షాకింగ్ గా ఉంది అదేమిటంటే రీసెంట్ గా వచ్చి సూపర్ హిట్ కొట్టిన "ఎక్కడికి పోతావు చిన్న వాడాలో అవికా చేసిన పాత్రకి 40 లక్షలు పారితోషికం తీసుకుందట. ఆ సినిమాలోని ఇద్దరు హీరోయిన్ ల కన్నా ఆమె చేసిన పనికి ఇది ఎక్కువ మొత్తం. అవికాకి ఒక సినిమా మొత్తమ్న్ చేసినా ఇంత పారితోషికం అందుతుంది అలాంటిది ఒక చిన్న పాత్రకోసం అంత తీసుకుందీ అంటే అది చిన్న విషయమేం కాదు. ఇక ఎక్స్ పోజింగ్ కీ రెడీ అంతూండతం తో అవికా మరిన్ని అవకాశాలను అందుకునే అవకాశం ఉన్నా ఆమెకి అదే మైనస్ కూడా అవ్వచ్చు అంటున్నరు సినీ జనాలు ఎందుకూ అంటే....

  ఎక్కడికి పోతావు చిన్నవాడా:

  ఎక్కడికి పోతావు చిన్నవాడా:

  అయితే.. ఇప్పుడు మాత్రం ఆమె దశ తిరిగిపోయిందంటున్నారు టాలీవుడ్ జనాలు. ఎందుకంటే.. ఇటీవల విడుదలై విజయవంతంగా దూసుకుపోతున్న ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రానికి రూ.40 లక్షల పారితోషికాన్ని ఆమెకు ముట్టజెప్పారట. ఆమెది సినిమాలో లీడ్ రోల్ కూడా కాదు. ఓ ప్రత్యేక పాత్ర. ఆ పాత్ర షూటింగ్ కోసం ఆమె సర్దుబాటు చేసిన కాల్షీట్లు కేవలం 10 రోజులు.

   ఆమెకే ఎక్కువ మొత్తం:

  ఆమెకే ఎక్కువ మొత్తం:

  ఈ పది రోజులకే అవికకు అంత పారితోషికాన్ని ఇచ్చారట. అంటే రోజుకు ఆమెకు అందించిన మొత్తం రూ.4 లక్షలన్నమాట. ఇక, సినిమాలోని ఇద్దరు హీరోయిన్ల కన్నా ఆమెకే ఎక్కువ మొత్తం ముట్టజెప్పారని టాక్. ఇంత పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకుందంటే ఆమె రేంజ్.. ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు టాలీవుడ్ జనాలు.

  మొదటి ప్రాధాన్యత:

  మొదటి ప్రాధాన్యత:

  ఉయ్యాలా జంపాలా' సినిమాతో కథానాయికగా తొలిహిట్ కొట్టిన ఈ అమ్మాయి, తాజాగా వచ్చిన 'సినిమా చూపిస్త మావ' తోను మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సహజంగానే యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ ను తెరకెక్కించాలనుకుంటోన్న దర్శకనిర్మాతలు అవికా గోర్ కి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.

  డిమాండ్ కన్నా తక్కువ:

  డిమాండ్ కన్నా తక్కువ:

  దాంతో ఈ అమ్మడు పారితోషికం విషయంపై దృష్టిపెట్టిందట. తాను ఇప్పటివరకూ తనకున్న డిమాండ్ కన్నా తక్కువ పారితోషికం తీసుకుంటూ వచ్చాననీ, ఇకపై అలా జరగదని చెబుతూంటే ఏమో..! అనుకున్నారు గానీ మరీ ఇంత రేంజ్ లో ఆమె చక్రం తిప్పగలదని ఎవరూ ఊహించలేదు..

  ఉయ్యాల జంపాల:

  ఉయ్యాల జంపాల:

  చిన్నారి పెళ్లికూతురిగా తెలుగు లోగిళ్లలో అందాల బొమ్మగా అలరించబడ్డ అవికా గోర్.. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ సినిమా హిట్ తో వరుసెంట ఐదారు సినిమాల్లో నటించిన అవికా ముద్దుగా ఉన్నా సరే కాస్త బొద్దుగా ఉంది అన్న కామెంట్ల వినపడ్డాయి. అంతేకాదు అలా ఉంటే ఎక్స్ పోజింగ్ కు కూడా కష్టమే అని దర్శక నిర్మాతలు చెప్పడంతో..

   స్కిన్ షో చేసేది లేదు:

  స్కిన్ షో చేసేది లేదు:

  సన్నబడ్డా కాని తాను మాత్రం స్కిన్ షో చేసేది లేదు అన్న బిల్డప్ ఇచ్చింది. సినిమా చూపిస్తా మావ తరవాత ఇక కొంతకాలం తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చినట్టు కటింగులిచ్చినా ఇక్కడ అవకాశాలు లేక బాలీవుడ్లో రియాలిటీ షోలు చేస్తున్న ఈ అమ్మడు ఇప్పుడు స్లింగా తయారై ఊరిస్తుంది.

  ఓ సెల్ఫీతో :

  ఓ సెల్ఫీతో :

  తన నడుము ఒంపులను చూపిస్తూ ఇక నుండి తాను కూడా గ్లామర్ షోకు రెడీ అన్నట్టే దర్శక నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఓ సెల్ఫీతో తన మనసులో ఉన్న ఫీలింగ్ ను బయటపెట్టేసింది ఈ సుందరి. ఈ లుక్ తో అవికాను హాట్ గా చూడాలనుకున్న వారి కల నెరవేరింది. ఇక సినిమాల్లో స్కిన్ షోకు కూడా అమ్మడు అడ్డు చెప్పే దాఖలాలేమి కనబడట్లేదు.

  దర్శక నిర్మాతలు క్యూ కట్టేలా:

  దర్శక నిర్మాతలు క్యూ కట్టేలా:

  మరి అందం అభినయం కలిగిన అవికా ఇక సై అంటే చాలు మళ్లీ అమ్మడి కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టేలా ఉన్నారు ప్రస్తుతం ఈ లుక్ చూస్తుంటే. అవికా అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండనున్నాయో చూడాలి. ఇక తెలుగులో రెండు మూడు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారే సరికి కొంత అలర్ట్ అయ్యింది. తనకు వచ్చే అవకాశాలు ఎందుకు తగ్గుతున్నాయో సరి చూసుకుంది.

  చూడ ముచ్చటగా మారింది :

  చూడ ముచ్చటగా మారింది :

  తన పర్సనాలిటీ వల్లే తనకు ఆఫర్లు వెనక్కి వెళ్తున్నాయని గట్టిగా కుస్తి పట్టి మరి జీరో సైజ్ గా తయారై చూడ ముచ్చటగా మారింది ఈ అమ్మడు. సో..! మొత్తానికి అవికా అంటే ఇప్పుడు ఓ హాట్ సింబల్ అనేలా ఉంది మరి దీన్ని సినిమాల్లో కూడా మెయింటైన్ చేసి కేక పెట్టిస్తుందో లేదో చూడాలి.

  ఫిలిం మేకింగ్ మీదా దృష్టి:

  ఫిలిం మేకింగ్ మీదా దృష్టి:

  ఇంతటితోనే అయిపోలేదు త్వరలోనే ఫిలిం మేకింగ్ లోకి అడుఇగుపెడతారంట మేడం. అప్పుడే ఫిలిం మేకింగ్ మీదా దృష్టి పెట్టింది. బాలికావధు హిందీ సీరియల్ తో టీనేజ్ లోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిన్నదానికి... టార్గెట్స్ చాలానే ఉన్నాయి. న్యూయార్క్ ఫిలిం అకాడమీ నుంచి స్క్రీన్ రైటింగ్ కోర్స్ చేస్తున్నట్లు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది అవిక. ఈ కోర్స్ చేయడం ద్వారా తనకు స్క్రిప్ట్ రాయడంతో పాటు.. సినిమాల రూపకల్పన పైనా అవగాహన ఏర్పడుతోందని చెబుతోంది.

  ఎక్స్ పోజింగ్ కి దిగితే:

  ఎక్స్ పోజింగ్ కి దిగితే:

  మొత్తానికి స్కిన్ షో చేయటానికి ఒప్పుకుంటున్నాను అని సిగ్నల్స్ ఇచ్చీ ఇవ్వగానే అసలు ఆ అవసరం లేకుండానే ఈ రేంజ్ ఉందంటే ఇక అమ్మడు ఎక్స్ పోజింగ్ కి దిగితే..!? ఎలా ఉంటుందో.. అయితే ఇక్కడ ఇంకో త్రెట్ కూడా ఉంది మరి. ఇప్పటి వరకూ అవికాని ఆదరించింది ఫ్యమిలీ ఆడియన్సే దానికి కారణం ఆమె కి టీవీ వల్ల వచ్చిన క్రేజ్ నిండా కాస్ట్యూంస్ తో పక్కింటి అమ్మాయి గా కనిపించటం వల్లే ఆమెకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది.

   బానే ఉంటుంది:

  బానే ఉంటుంది:

  కానీ ఇప్పుడు స్కిన్ షో అంటే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో మరి. క్లిక్ అయితే బానే ఉంటుంది గానీ లేదంటే మాత్రం మళ్ళీ వెనకబడి పోవాల్సిందే.. ఇక్ప్పటికే సినిమాల్లోకి అడిగు పెటి అయిదేళ్ళు దగ్గర పడుతోంది ఈ సమయం లో తీసుకునే నిర్ణయాలే మిగతా అయిదు సంవత్సరాల కెరీర్ ని నిర్ణయిస్తాయి మరి...

  English summary
  It is heard that Avika wrapped the shoot of her part in ten days only and got Rs 40 lakh as a remuneration for her cameo role. She was highest paid among all the three actresses that acted in the movie. Earlier she was not ready to play the small role as she wanted only lead role but later she demanded high remuneration and producer became agree to fulfill her demand.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more