twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవికాగోర్.. పెద్ద ఇత్తడి చెంబండీ బాబూ...(వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్: అది పెద్ద ఇత్తడి చెంబండీ బాబు అంటున్నాడు సప్తగిరి..ఎవరిని ఉద్దేశించి అంటే అవికాగోర్ ని...ఎందుకలా అంటే సినిమా ‘లక్ష్మీ రావే మా ఇంటికి' చూడాల్సిందే... ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేసారు. డీసెంట్ గా, మంచి డైలాగులతో ఈ ట్రైలర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. అమ్మాయి తండ్రిని కన్వీన్స్ చేసే పాత్రలో నాగ శౌర్య కనిపించనున్నారు. ఎంగేజ్ మెంట్ అయిన అమ్మాయి తో ప్రేమలో పడి ఆమె తండ్రిని ఎలా కన్వీన్స్ చేసాడనే కథ అనిపిస్తోంది. ఈ ట్రైలర్ చూస్తూంటే..మీకూ అలాగే అనిపిస్తుందేమో చూడండి...

    నాగశౌర్య, అవికా గోరే హీరోహీరోయిన్లుగా గిరిధర్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ నిర్మిస్తున్న ‘లక్ష్మీ రావే మా ఇంటికి' . నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకొన్నాయి. పాత్రలకు తగిన నటీనటుల్ని ఎన్నుకోవడంతో చిత్రం బాగా వచ్చింది. కె.ఎం.రాధాకృష్ణన్‌ సంగీత సారథ్యంలో రూపుదిద్దుకొన్న పాటలు వీనుల విందుగా ఉంటాయి. ఆడియోతో పాటు సినిమా కూడా హిట్‌ అవుతుందని నమ్మకం ఉంది

    Avika Gor's Lakshmi Raave Maa Intiki Trailer

    ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమవుతున్న నంద్యాల రవి మాట్లాడుతూ ‘లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమా రూపుదిద్దుకొంది' అని తెలిపారు.

    నిర్మాత గిరిధర్ మాట్లాడుతూ- ఓ మంచి కథాంశంతో సినిమా రూపొందించాలన్న తన కోరిక ఈ చిత్రంతో నెరవేరుతుందని, దర్శకుడు రవి మంచి కథ చెప్పడంతో మొదలెట్టామని, అవికాగోర్ హీరోయిన్ గా నటిస్తుండడంతో ఈ చిత్రానికి మరింత అందం వచ్చిందని తెలిపారు. ‘ఇడియట్'లో రవితేజకు వచ్చినంత పేరు కథానాయకుడు శౌర్యకు ఈ చిత్రం ద్వారా వస్తుందని, ఆయన అన్నారు.

    కుటుంబమంతా కలిసి చూసే విధంగా ఈ చిత్రాన్ని లవ్ ఎంటర్‌టైనర్‌గా అందిస్తున్నామని, మంచి టీమ్ కుదరడంతో సినిమా కూడా బాగా వస్తుందన్న నమ్మకం ఉందని దర్శకుడు నంద్యాల రవి తెలిపారు.

    ఈ సినిమాలో తన పాత్ర గూర్చి తెలియగానే ఆ పాత్రతోనే తాను ప్రయాణిస్తున్నానని, అంతగా నచ్చిన ఈ పాత్ర సినిమా అందరికీ నచ్చుతుందన్న ఆశాభావం హీరోయిన్ అవికాగోర్ వ్యక్తం చేసింది.

    షాయాజీషిండే, అలీ, సత్యం రాజేశ్‌, రావు రమేశ్‌, అనితా చౌదరి, ప్రగతి, భగవాన్‌, శశి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: బాలరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కుంపట్ల రాంబాబు, సమర్పణ: తాడిశెట్టి వెంకట్రావు, కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: నంద్యాల రవి.

    English summary
    'Lakshmi Raave Maa Intiki' stars Naga Shaurya (Oohalu Gusagusalaade fame) and Avika Gor (Uyyala ampala fame) in lead roles. Lakshmi Raave Maa Intiki is an upcoming Telugu film directed by Nandyala Ravi. The film is produced by Giridhar Mamidipalli. Radhakrishna is composing the music for the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X