ఎక్స్‌ఫోజింగ్ చేయమంటే...పవన్ సినిమా తిరస్కరిస్తా!
హైదరాబాద్: ఎట్టి పరిస్థితుల్లోనూ గ్లామర్ రోల్స్ చేయనని, ఎక్స్ ఫోజింగుకు, గ్లామర్ రోల్స్‌కు తన డిక్షనరీలో స్థానం లేదని తేల్చి చెబుతోంది హీరోయిన్ అవికా గోర్. అలాంటి పాత్రలు చేయవలసి వస్తే పవన్ కళ్యాణ్ సినిమా అయినా, అమితాబ్ బచ్చన్‌తో సినిమా అయినా నిర్మొహమాటంగా వదలుకుంటాను అంటోంది.

‘ఉయ్యాల జంపాల' సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన చిన్నారి పెళ్లికూతురు సీరియరల్ ఫేం అవికా గోర్ ఇటీవల నాగ శౌర్యతో ‘లక్ష్మీ రావే మా ఇంటికి' అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. నంద్యాల రవి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి గిరిధర్ నిర్మాత. ఈ చిత్రంలో సంప్రదాయానికి విలువిచ్చే పాత్రలో కనిపించి అందరి మెప్పుని పొందింది అవికా గోర్.
తెలుగులో చేసిన రెండు వరుస సినిమాల్లోనూ మంచి పేరు రావడంతో ఆమెకు హీరోయిన్‌గా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆమె ‘సినిమా చూపిస్త మావ' అనే సినిమాలో రాజ్ తరుణ్ సరసన నటిస్తోంది. రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా నటించిన ‘ఊయ్యాల జంపాల' చిత్రం మంచి విజయం సాధించడంతో ఈ ఇద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది.


Click it and Unblock the Notifications











