twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఉయ్యాలా జంపాలా’హీరోయిన్ రెండో సినిమా

    By Srikanya
    |

    హైదరాబాద్: క్రితం సంవత్సరం విడుదలైన చిన్న చిత్రాల్లో మంచి విజయం సాధించిన చిత్రం 'ఉయ్యాలా జంపాలా'. ఈ చిత్రం రీసెంట్ గా యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఇందులో నటించిన హీరో,హీరోయిన్స్ కి మంచి క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా హీరోయిన్ అవికా గోర్ కి ఆఫర్స్ లెక్క లేనన్ని వచ్చాయి. అయితే ఆమె రెమ్యునేషన్ విషయంలో పట్టు పట్టడంతో పెద్ద సినిమాలు పడలేదు. అయితే తాజాగా ఆమె ఓ చిత్రం సైన్ చేసి,మళ్లీ వార్తల్లో నిలిచింది.

    రచయిత నంధ్యాల రవి దర్శకత్వంలో రూపొందే చిత్రం ఆమె సైన్ చేసింది. జర్నలిస్ట్ అయిన గిరిధర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ రోజు (పిభ్రవరి 20)న లాంచ్ కానుంది. మీడియం బడ్జెట్ తో తెరకెక్కించనున్నారని సమాచారం.

    'ఉయ్యాలా జంపాలా'కు ముందే అవికాగోర్ తెలుగువారికి పరిచయం. 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ తో ఆంధ్రప్రదేశ్ లో మంచి గుర్తింపు వచ్చింది. దాంతో ఆమె ఫ్యాన్స్ తో ఈ చిత్రానికి ఓపినింగ్స్ సైతం రాబట్టుకుంది.

    ఇక ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు సమర్పణలో సన్‌షైన్‌ సినిమాస్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకాలపై విరించివర్మ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం 'ఉయ్యాలా జంపాలా'. నాగార్జున, హిట్‌ చిత్రాల నిర్మాత రామ్మోహన్‌ పి. నిర్మించిన ఈ విభిన్న కథా చిత్రం బావా మరదళ్ల ప్రేమ కథగా రూపొంది విడుదలైంది. ఈ చిత్రం రిలీజైన రోజు నుంచి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. పబ్లిసిటీ తో కలిపి రెండున్నర కోట్లు బడ్జెట్ అయిన ఈ చిత్రం 17 కోట్లు(గ్రాస్)కలెక్టు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. చిన్న సినిమాగా రిలీజైన ఈ చిత్రం కలెక్షన్స్ లో పెద్ద సినిమాతో పోటీ పడటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

    English summary
    
 Avika Gor who earlier acted in Uyyala Jampala has signed her second film. This film is a woman-oriented one. Writer Nandyala Ravi will be directing this film. Former Journalist Giridhar will be producing this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X