పెళ్లైన రెండో రాత్రే గొడవ, మూర్ఖురాలు.. వాళ్ల నాన్నే చెప్పాడు: స్వాతి నాయుడు భర్త
టాలీవుడ్ నటి, యూట్యూబ్ శృంగార తార స్వాతి నాయుడు పెళ్లి చాలా మందిని ఆశ్చర్య పరిచింది. అవినాష్ అనే అబ్బాయితో ఆమె వివాహం ఫిబ్రవరిలో జరిగిన సంగతి తెలిసిందే. ఎంతో హాండ్సమ్‌గా ఉన్న ఈ పోరగాడిని ఆమె ఎలా ప్రేమలో పడేసిందో? అని అంతా చర్చించుకుంటున్న నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో అవినాష్ తనకు స్వాతి నాయుడు ఎలా పరిచయమైందో వివరించారు.
అవినాష్ మాట్లాడుతూ... 'నాకు పబ్స్ వెళ్లే అలవాటు ఉండేదని, బెట్టింగ్స్ అంటే చాలా ఇష్టం. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుండగా పబ్‌లో బెట్టింగ్స్ కాస్తూ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తుండగా స్వాతి నాయుడు తొలిసారి కలిసింది' అన్నారు.

ముద్దు కావాలని అడిగింది, షాకయ్యా...
ఆ రోజు పబ్‌లో బిగ్ స్క్రీన్ ముందు మాకు మ్యాచ్ కనిపించకుండా కొంతమంది అమ్మాయిలు అడ్డుగా కూర్చుని ఉన్నారు. అదే సమయంలో స్వాతి గ్లాస్ పట్టుకుని అటుగా వెళుతుంటే... వారిని కాస్త పక్కకు జరుగమని చెప్పండి అన్నాను. చెబితే నాకేంటి? అంది... ఆమె బీర్, బ్రీజర్, జ్యూస్ లాంటివి అడుగుతుంది అనుకుంటే కిష్ కావాలని అడిగింది. ఆమె అలా అనడంతో షాకయ్యాను. నాకు అపుడు మ్యాచ్ ముఖ్యం కాబట్టి ముద్దు పెట్టేశాను. తర్వాత తను ఎక్కడికి వెళ్లిందో కూడా తెలియదు. నేనూ పట్టించుకోలేదని అవినాష్ గుర్తు చేసుకున్నారు.

గోవా ట్రిప్ వెళ్లి వచ్చాక మరింత క్లోజ్
ఆ రోజు మేము అనుకున్నట్లే మ్యాచ్ విన్ అయింది. ఆ తర్వాత ఆమె గురించి ఆరా తీస్తే స్వాతి నాయుడు అని తెలిసింది. అలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. గోవా ట్రిప్ వెళ్లి వచ్చిన తర్వాత ఇద్దరం చాలా క్లోజ్ అయ్యాం. మరుసటిరోజే స్వాతి నాకు ప్రపోజ్ చేసిందని తెలిపారు.

ప్రేమించడం మొదలు పెట్టాక కండీషన్స్
అంతకు ముందు వరకు అవినాష్ తన గర్ల్ ప్రెండ్స్‌తో తిరిగినా నాకు బాధ అనిపించేది కాదు. అపుడు నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. నేను ప్రపోజ్ చేసిన తర్వాత, ప్రేమించడం మొదలు పెట్టిన తర్వాత కండీషన్స్ పెట్టడం మొదలు పెట్టాను. ఇద్దరి మధ్య చాలా గొడవయ్యాయి. చేతులు కోసుకోవడం వరకు వెళ్లింది. అందరు అమ్మాయిలకు తెలిసిపోయింది. అవినాష్‌ను కెలికితే స్వాతి పోట్లాడుతుంది అని భయపడేవారు. త్వరలో హనీమూన్ గోవాలో సెలబ్రేట్ చేసుకోబోతున్నామని స్వాతి నాయుడు తెలిపారు.

వాళ్ల నాన్నే తను మూర్ఖురాలు అని చెప్పాడు
మా పెళ్లయిన తర్వాత సెకండ్ నైట్ గొడవైంది. అపుడు వాళ్ల నాన్న ఓ విషయం ఓపెన్ గా చెప్పాడు. నువ్వు అన్నీ తెలిసే పెళ్లి చేసుకున్నావు కదా...తను మూర్ఖురాలు, మనమే చేంజ్ కావాలని అన్నారు. ఆమె గురించి కొన్ని గలీజ్ మాటలు కూడా అన్నాడు, కానీ ఆ మాటలు ఇక్కడ చెప్పలేను. అందుకే నేను మారిపోయి నాకు కావాల్సింది మా అత్త మామాలను అడిగటం మొదలు పెట్టాను అని అవినాష్ తెలిపారు.

స్వాతి నాయుడు చేస్తున్న వృత్తిపై నాకు అభ్యంతరం లేదు
పెళ్లి తర్వాత సాధారణంగా భర్తలు భార్యలపై కొన్ని అభ్యంతరాలు పెడతాను. నేనైతే అలాంటివేమీ పెట్టడంలేదు. పెళ్లికి ముందు తను ఏ ప్రొఫెషన్లో ఉందో పెళ్లి తర్వాత కూడా ఉండొచ్చు. అయితే నేను మాత్రం సినిమాల వైపు రాను. ఈ విషయంలో మా మధ్య చాలా గొడవలు కూడా అయ్యాయి. నా నిర్ణయం మాత్రం అదే... అని అవినాష్ స్పష్టం చేశారు.

అలా చేస్తే ఇద్దరం సంపాదించుకోవచ్చు
గతంలో షూట్లకు వెళ్లినపుడు ఈ అబ్బాయి చాలా బావున్నాడు మీ పక్కన ఏదైనా సీన్స్ ఉంటే చేయమనండి అని అడిగారు. తను మాత్రం చేయను అంటున్నాడు. నేను అసలే డబ్బు పిచ్చిదాన్ని.. నువ్వు కూడా చేస్తే ఇద్దరం ఫేమస్ అవ్వొచ్చు, ఇద్దరం కలిసి సంపాదించుకోవచ్చు కదా అన్నాను. తను మాత్రం నా మాట వినడం లేదు. ఫ్యూచర్లో అతడిని ఎలాగైనా నటించడానికి ఒప్పించే ప్రయత్నం చేస్తాను అని స్వాతి నాయుడు తెలిపారు.


Click it and Unblock the Notifications











