Kannappa Movie: మంచు ఫ్యామిలీ నుంచి మరో వారసుడు ఎంట్రీ.. ఇంతకీ ఎవరంటే?

సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది స్టార్ హీరోల, హీరోయిన్ల వారసులు ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయినవారు ఉన్నారు. ఇక ముఖ్యంగా చిన్న తనంలోనే చాలా మంది స్టార్లు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయినవారు ఉన్నారు. అల్లు అర్జున్ నుంచి మహేశ్ బాబు వరకు చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లో నటించి స్టార్లు అయిన వారే. ఇప్పుడు ఇండస్ట్రీలోకి మరో స్టార్ కిడ్ రాబోతున్నాడు. ఆయన ఎవరో కాదు.. మంచు ఫ్యామిలీ వారసుడు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సినిమా ఇండస్ట్రీలోకి మంచు ఫ్యామిలీ నుంచి మరో వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈ ఫ్యామిలీ నుంచి మోహన్ బాబు వారసులు మంచు విష్ణు, మంచు లక్ష్మి, మంచు మనోజ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇక మంచు మనోజ్ అయితే చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన సంగతి తెలిసిందే. చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటించాడు ఈ కుర్ర హీరో. ఇక ఈ ఫ్యామిలీ నుంచి మరో స్టార్ కిడ్ ఇండస్ట్రీలోకి రాబోతుంది.

 Avram Manchu Entry With Vinshnu Manchu Dream Project Kannappa Full Details Here

విష్ణు మంచు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ 'కన్నప్ప' సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మీదున్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. న్యూజిలాండ్‌‌లో లాంగ్ షెడ్యూల్‌ను ఈ సినిమా పూర్తి చేసుకుంది. ఇక ఇటీవలే ఇండియాకు కన్నప్ప టీం తిరిగివచ్చింది. తాజాగా కన్నప్ప నుంచి మరో అప్డేట్‌ను మేకర్స్ అందించారు. ఇప్పటి వరకు ఈ చిత్రంలో మోహన్ లాల్, ప్రభాస్, మోహన్ బాబు వంటి స్టార్ నటులు నటిస్తున్నట్లు ప్రకటించగా.. ఇక ఇప్పుడు మంచు వారి నుంచి మూడో తరం కూడా ఈ కన్నప్ప సినిమాలో నటిస్తున్నట్లు వెల్లడించారు.

మోహన్ బాబు వారసుడిగా సినిమాల్లోకి విష్ణు మంచు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు విష్ణు మంచు వారసత్వంగా అవ్రామ్ మంచు కన్నప్పతో ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. విష్ణు మంచు తన ఐదేళ్ల కొడుకు అవ్రామ్ సినిమా రంగ ప్రవేశాన్ని అద్భుతమైన దృశ్యకావ్యమైన 'కన్నప్ప'తో మొదలుపెట్టనున్నట్లు వెల్లడించారు. ఎం.మోహన్ బాబు నుంచి మొదలుకొని ఈ చిత్రంలో మూడు తరాలకు చెందిన అంటే మంచు విష్ణు, ఆయన కొడుకు అవ్రామ్ మంచు నటిస్తున్నారు.

న్యూజిలాండ్‌లోని సుందరమైన ప్రకృతి దృశ్యాల నడుమ 90 రోజులు నిర్విరామంగా కన్నప్పు షూటింగ్ జరుపుకుంది. అవ్రామ్ పాత్రకు కన్నప్పలో ఎంతో ప్రాధాన్యత ఉందని సమాచారం. తన కొడుకు ఇలా సినీ ఎంట్రీ ఇస్తుండటంపై విష్ణు మంచు సైతం తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 'ఈ 'కన్నప్ప' సినిమాకు నా జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. నా కొడుకు అవ్రామ్ కీలక పాత్రలో నటించడం చాలా గర్వకారణం. ఇది కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు. ఇది మా కుటుంబం యొక్క మూడు తరాల కలయికతో వస్తోన్న అరుదైన చిత్రం' అంటూ తన సోషల్ మీడియా ఖాతా వేదికగా చెప్పుకువచ్చారు.

 Avram Manchu Entry With Vinshnu Manchu Dream Project Kannappa Full Details Here

కన్నప్ప మొదటి షెడ్యూల్ ముగియగానే విష్ణు మంచు తనకు సహకరించిన టీంకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇప్పుడు తన కొడుకు ఎంట్రీపై రియాక్ట్ అయ్యారు. 'అవ్రామ్‌తో కలిసి ఈ సినిమా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. సినీ ప్రేమికులందరి ఆశీర్వాదం కోరుకుంటున్నట్లు చెప్పారు. 'కన్నప్ప' ప్రతి ఒక్కరికీ ఒక చిరస్మరణీయ అనుభూతిని కలిగిస్తుందని స్పష్టం చేశారు. ఇది మా కుటుంబంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని వివరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X