బ్రహ్మానందంతో వివాదంపై ఎవిఎస్ వివరణ

By Srikanya

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందంకు, ఎవియస్ కీ మధ్య ఆ మధ్యన అభిప్రాయ బేధాలు వచ్చి పెద్ద వివాదమే రేపాయి. ఓ విషయంలో ఎవియస్ ఆయనకు వ్యతిరేకంగా ధ్వజమెత్తారు. ఈ విషయమై ఆయన నిన్న రాత్రి ఓ టీవీ ఛానెల్ కార్యక్రమంలో మాట్లాడుతూ..బ్రహ్మానందం నాకు కొన్ని వేషాలు రాకుండా చేశారని.. నాకూ ఆయనకూ పడదనీ... నేను అనను. అయితే.. ఆయన మహర్జాతకుడు. మా ఇద్దరి మధ్య చిన్న కమ్యూనికేషన్ గ్యాప్. అయితే మళ్లీ కలిసిపోయాం. ఆయనకు వ్యతిరేకంగా పరిశ్రమలో కొందరు మాట్లాడారు. నేను వారికి నాయకత్వం వహించాను. కానీ ఆయన్ను వ్యతిరేకించినవారిలో 80 శాతం మంది ప్లేటు ఫిరాయించి వెంటనే ఆయన దగ్గర చేరారు. నేను ఆయనతో కలవడానికి మూడు నెలలు పట్టింది. ఆ విషయంలో నా తప్పు తెలుసుకున్నాను అన్నారు.

అలాగే ఆయన్నుంచీ హాని లేకపోయినా, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడాను. నేను అలా చేసుండకూడదు. ఎవరికో ఏదో జరిగితే నేను ముందుపడ్డాను అని తేల్చి చెప్పారు. ఇక 'మా' సెక్రటరీ పదవిని అవకాశాల కోసం ఉపయోగించుకున్నారనే విమర్శలనీ ఆయన కొట్టిపారేసారు... రెండుసార్లు సెక్రటరీగా ఉన్నాను. దాని వల్లే ఆర్టిస్టుగా చాలా నష్టపోయాను. ప్రస్తుతం జాయింట్ సెక్రటరీగా కొనసాగుతున్నాను. ఎన్నికలు త్వరగా వస్తే ఆ పదవికి దండం పెట్టేద్దామనుకుంటున్నా అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X