గాలి లేకపోయినా బ్రతకగలడు కానీ అది లేకపోతే ఏవీయస్ కి కష్టంట
గాలి లేకపోయినా బతకగలను. కానీ సినిమా అనే ఆలోచన లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేను.నాకు సినిమా ఒక్కటే తెలుసు. అందుకే నటించినా, దర్శకత్వం వహించినా, కలం పట్టి రచన చేసినా అందులో సంతృప్తి లభిస్తోంది. అంటున్నారు హాస్య నటుడు నుంచి దర్శకుడుగా మారిన ఎవీయస్. ఆయన తాజాగా చిత్రం కోతి మూక త్వరలో రిలీజ్ కాబోతోంది. ఆ సందర్భంగా ఆయన మీడియాను కలిసి మాట్లాడారు. ఆయన మాటల్లోనాే...ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఈ రెండు విషయాలు నా ముందు ప్లాపులు నేర్పాయి. ఆ పాఠాన్ని ప్రతీ ఫ్రేములోనూ గుర్తు చేసుకుని సినిమా తీశాను. అనుకోకుండా 'సూపర్ హీరోస్'తో మెగాఫోన్ పట్టాను. ఆ సినిమా బాగా ఆడితే బహుశా అక్కడే ఆగిపోయేవాడ్ని. గెలుపు కోసం తపన పడే అవకాశం ఉండేది కాదు. ఇన్ని విషయాలు తెలిసేవీ కావు. ఆ తపనతో, నేర్చుకొన్న పాఠాలతో 'కోతిమూక' తీర్చిదిద్దాను అన్నారు. 'కోతిమూక' ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బెస్టాఫ్ లక్ ఏవియస్.


Click it and Unblock the Notifications