హాస్య నటుడు ఏవియస్ ప్రధాన పాత్రలో నేను గాంధీని కాదు అనే సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి నల్లపూసలు బాబ్జీ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఈ మధ్యనే అనారోగ్యంతో ఆసుపత్రిపాలైన ఏవియస్ క్షేమంగా బయిటపడ్డారు. కోలుకున్న తర్వాత ఇప్పుడీ చిత్రమే చేయనున్నారు. కామిడీ ప్రధానంగా ఎమోషన్స్ అండర్ ప్లే చేస్తూ ఈ చిత్రాన్ని వర్కవుట్ చేయాలని యోచిస్తున్నారుట. ఇక ఈ చిత్రాన్ని ఓ పేరున్న నిర్మాణ సంస్ధ (బహుశా సి.సి.రెడ్డి తో ఉన్న అనుభంధంతో విసు ఫిల్మ్ వారే కావచ్చు) నిర్మించబోతున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినపడుతున్నాయి. బాబ్జీ ప్రస్తుతం విసు బ్యానర్ లో నిర్మాణమవబోతున్న చాయ్...బిస్కట్...సమోసా చిత్రం రూపొందించటానికి స్క్రిప్టు రెడీ చేసుకుంటున్నారు.