twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవిబాబు ‘అవును-2’ ఫస్ట్ లుక్ (పోస్టర్)

    By Srikanya
    |

    హైదరాబాద్: రవిబాబు గతంలో రూపొందించిన ‘అవును' చిత్రానికి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘అవును-2' అనే పేరును నిర్ణయించి ఆ మధ్యన ట్రైలర్ ని సైతం విడుదల చేసారు. ఇప్పుడు ఫస్ట్ లుక్ పొస్టర్ ని విడుదల చేసారు. సురేష్ ప్రొడక్షన్స్, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ పతాకాలపై రవిబాబు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హర్షవర్థన్ రానె, పూర్ణ జంటగా రూపొందింది.

    రవిబాబు మాట్లాడుతూ ‘‘అవును సినిమా ఎక్కడ ముగిసిందో, అక్కడి నుంచే అవును-2 మొదలవుతుంది. ఆ సినిమాలోని పాత్రలతోనే ఈ సినిమా సాగుతుంది. మరో రెండు, మూడు కొత్త పాత్రలు కూడా యాడ్‌ అవుతాయి. ఈ సినిమాలో సెల్‌కాన్‌ ట్యాబ్‌ కీలక పాత్ర పోషించింది. నిఖిత పాత్ర కూడా ముఖ్యమైనదే. తొలి భాగంలో కనిపించని కెప్టెన్‌ రాజు గురించి ఈ సినిమాలో చూపిస్తున్నాం'' అని అన్నారు.

    Avunu-2's Official First Look Poster

    డి.సురేశ్‌బాబు మాట్లాడుతూ ‘‘అవును-2 సినిమాను రవిబాబు చాలా వైవిధ్యంగా తెరకెక్కిస్తున్నారు. పార్ట్‌ 1 కంటే 2 ఇంకా బావుంటుంది. హారర్‌ సినిమాలను ఎంజాయ్‌ చేయాలనుకునే ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఎంజాయ్‌ చేస్తారు. డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.

    నిఖిత, సంజన, చక్రవర్తి, రవివర్మ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు స్ర్కీన్‌ప్లే: సత్యానంద్‌, కెమెరా: ఎన్‌.సుధాకర్‌రెడ్డి, సంగీతం: శేఖర్‌చంద్ర, ఎడిటర్‌: మార్తాండ్‌.కె.వెంకటేశ్‌, ఆర్ట్‌: భూపే్‌శ ఆర్‌.భూపతి, రచన, నిర్మాత, దర్శకత్వం: రవిబాబు.

    English summary
    The official poster of Avunu 2 movie released on whatsapp and to get the first glimpse of this horror thriller. The lead cast of the film remains the same as the first part with Harshwardhan Rane and Poorna reprising their roles. Jointly produced by Suresh productions and Flying Frogs Entertainment, the movie is getting ready for release in December.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X