రవిబాబు ‘అవును’ రిలీజ్ డేట్ ఖరారు
గతంలో యామి గౌతమి రవిబాబు దర్శకత్వంలో 'నువ్విలా' చిత్రంలో నటించింది. ఈ సినిమా గురించి రవిబాబు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.... ''నువ్విలా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు... అందులో హీరోయిన్ గా నటించిన యామీగౌతమ్ తన నిజ జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాలను నాతో పంచుకొందన్నారు.
అవన్నీ విని.. నాకే చాలా భయమేసింది. యామి చెప్పిన సంగతులనే స్ఫూర్తిగా తీసుకొని తీర్చిదిద్దిన చిత్రమిది'' వెల్లడించారు. ''ఎలాంటి హడావుడి లేకుండా సినిమాలు తీయడమంటేనే నాకిష్టం. 'అవును' అలా రూపుదిద్దుకొన్నదే చిత్రమే అని తెలిపారు. డి.సురేష్‌బాబు, పి.వి.పి. అధినేత పొట్లూరి వరప్రసాద్, రవిబాబు నిర్మాతలుగా ఫ్లయింగ్ ఫ్రాగ్స్ పతాకంపెై రూపొందిస్తున్న 'అవును' చిత్రం రూపొందుతోంది.
పూర్ణ, హర్షవర్ధన్‌రాణె, ఎవిఎస్ అల్లుడు చక్రవర్తి, భార్గవి, చలపతిరావు, ఢిల్లీ రాజేశ్వరి, మాస్టర్ గౌరవ్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రవిబాబు గత చిత్రాల స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా చేసిన చిత్రమని అంటున్నారు.


Click it and Unblock the Notifications












