యూఎస్‌లో అ! కలెక్షన్ల హవా.. బాక్సాఫీస్ వద్ద హంగామా.. తెలుగు రాష్ట్రాల్లో..
హీరోగా నాని వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఓ వైపు హీరోగా సక్సెస్‌లను అందుకుంటూనే తాజాగా నిర్మాతగా మారి అ! అనే చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రంలో కాజల్, నిత్యామీనన్, రెజీనా, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించారు. వైవిధ్యమైన చిత్రంగా ప్రచారం జరిగిన చిత్రానికి దర్శకుడిగా ప్రశాంత్ వర్మ వ్యవహరించారు. ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం డివైడ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. కానీ ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ చిత్రం దుమ్మురేపుతున్నది.
Recommended Video


యూఎస్ బాక్సాఫీస్ వద్ద
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అ! చిత్రం ఓవర్సీస్‌లో మంచి వసూళ్లను రాబడుతున్నది. అమెరికాలో ఈ చిత్రం హాఫ్ మిలియన్ దిశగా దూసుకెళ్తున్నది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 21వ స్థానంలో నిలువడం సినిమా స్టామినాకు అద్దం పట్టింది.

మిశ్రమ స్పందన
అమెరికాలో అ! చిత్రం ప్రీమియర్ ప్రదర్శనకు మంచి స్పందన లభించింది. గురువారం ఈ చిత్రం 126851 డాలర్లను వసూలు చేసింది. శుక్రవారం 140629 డాలర్లను కలెక్ట్ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు
అ! చిత్రం ప్రపంచవ్యాప్తంగా 3.6 కోట్ల గ్రాస్ వసూళ్లను, 1.7 కోట్ల నికర కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రం సుమారు 6 కోట్ల రూపాయలతో నానీ రూపొందించిన సంగతి తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల్లో
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 1.5 కోట్ల గ్రాస్, 90 లక్షల షేర్‌ను సాధించింది. ఇక ప్రాంతాల వారీ పరిశీలిస్తే...నైజాంలో 38 లక్షల షేర్, వైజాగ్‌లో 11 లక్షలు, తూర్పు గోదావరిలో 7 లక్షలు, పశ్చిమ గోదావరిలో 6 లక్షలు, కృష్ణా జిల్లాలో 9 లక్షలు, గుంటూరులో 8. నెల్లూరులో 2 లక్షలు సాధించింది.

మల్టీప్లెక్స్‌లో జోరు
విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందిన అ! చిత్రం ఓ వర్గం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొంటున్నది. మల్టీప్లెక్స్, అర్బన్ ఆడియెన్స్ ఈ చిత్రాన్నిబాగా ఆదరిస్తున్నారు. బీ, సీ సెంటర్లలో ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదనే వార్తలు అందుతున్నాయి.


Click it and Unblock the Notifications











