ప్రీమియర్ షో రెస్పాన్స్ : అ!..అంతా కలసి అదరగొట్టేశారు.. నాని, రవితేజ అలా..!
Recommended Video

నాని తొలిసారి నిర్మాతగా వ్యవహరించిన చిత్రం అ! ఈ చిత్రంలోని నటీ నటులు మినహా మిగిలిన ఏ ఇతర వివరాలు బయట పడకుండా చిత్ర యూనిట్ చాలా సీక్రెట్ మెయిన్ టైన్ చేసింది. అంటే ఈ చిత్రంలో అభిమానులని మెస్మరైన్ చేసే అంశాలు ఉన్నట్లే. దీనికి తగ్గట్లుగా భారీ తారాగణం ఈ చిత్రంలో నటించారు. కాజల్ అగర్వాల్, రెజీనా, నిత్య మీనన్, మురళి శర్మ, శ్రీనివాస్ అవసరాల మరియు ఈషా రెబ్బ వంటి స్టార్ లంతా ఈ చిత్రంతో కోసం ఏకం అయ్యారు.

వైవిధ్యభరితం
ఈ చిత్రంలో ప్రతిసన్నివేశం కొత్తదనంతో ఆకట్టుకుంటుంది. నటీనటులంతా తమ పరిధి మేరకు అద్భుతంగా నటించారు. స్టార్ హీరోయిన్లు కాజల్, రెజీనా మరియు నిత్యామీనన్ పాత్రలని దర్శకుడు మలచిన విధానం బావుంది.

మురళి శర్మ, శ్రీనివాస్ అవసరాల మ్యాజిక్
మురళి శర్మ, శ్రీనివాస్ అవసరాల మ్యాజిక్ కు సంబందించిన సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. ఆ సన్నివేశాలని చూసి ఆడియన్స్ ఆశ్చర్యానికి గురికావడం ఖాయం.

ఫస్ట్ హాఫ్ అలా రైడ్ చేశాడు
ప్రతి పాత్రని ఆకర్షణీయంగా, అర్థవంతగా పరిచయం చేస్తూ దర్శకుడు ఫస్ట్ హాఫ్ నడిపించాడు. చిన్న పాపని, రెజీనాని కథలో ఇన్వాల్వ్ చేసిన విధానం హైలైట్. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి దర్శకుడు చిత్రాన్ని మరింతా ఆసక్తికరంగా మార్చేశాడు.

సెకండ్ హాఫ్ లో రెస్టారెంట్ సీన్స్
సెకండ్ హాఫ్ లో రెస్టారెంట్ నేపథ్యంలో సాగె సన్నివేశాలు ఉత్కంఠని కలిగిస్తాయి. క్లైమాక్స్ ని కొత్తగా డిజైన్ చేసిన దర్శకుడు తెరపై ఆసక్తికరంగా ఆవిష్కరించాడు.

నాని, రవితేజ అలా
నాని రవితేజ ఈ చిత్రంలో ఎలాంటి పాత్రలో నటించారనే ఉత్కంఠ అభిమానుల్లో ఉంది. ట్రైలర్ లో చూపిన విధంగా నాని చేప పాత్రలో కనిపిస్తే, రవితేజ ఓ చెట్టుకు వాయిస్ ఓవర్ అందించి అలరించాడు.

సందేశం కూడా ఉంది
ఈ చిత్రాన్ని దర్శకుడు ఓ మంచి సందేశాత్మక సన్నివేశంతో ముగిస్తాడు. చిత్రంలోని ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటూ అభిమానులని అలరిస్తాయి.

దర్శకుడి ప్రతిభ
ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తాను అనుకున్నట్లు తెరపై ఆవిష్కరించడంలో వంద శాతం విజయం సాధించాడని చెప్పొచ్చు. ఆడియన్స్ ని కొత్త తరహా కథలో రిఫ్రెష్ చేయాలనే ఆయన తపన తెరపై కనిపించింది. స్టార్స్ అందరిని వారికి తగ్గ పాత్రల్లో నటింపజేయడం, అంతకు మించి అద్భుతంగా స్క్రీన్ ప్లే నడిపించడం చాలా బావుంది.

వారి సంగతి
ఈ చిత్రంలో కాజల్ పాత్రకూడా ట్రయిలర్ లో ఆసక్తి రేకెత్తించింది. కాజల్ పాత్ర విషయంలో పెంచిన అంచనాల మేరకు దర్శకుడు న్యాయం చేసాడని చెప్పొచ్చు. ఇక నిత్యామీనన్, ఈషా రెబ్బ కూడా బాగా నటించారు.

నానికి కాసులొస్తాయా
సరికొత్త కథలని ఇష్టపడేవారిని ఈ చిత్రం అలరిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ చిత్ర మౌత్ టాక్, జనరల్ ఆడియన్స్ స్పందన బట్టి ఎంత స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











