నాని ‘అ!’ టీజర్ విడుదలైంది.... వావ్ అనేలా ఉంది!

By Bojja Kumar

Recommended Video

నాని ‘అ!’ టీజర్.. వావ్ అనేలా ఉంది!

యంగ్ హీరో నాని నిర్మాతగా 'అ!' అనే చిత్రం తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నటిస్తున్న ముఖ్య పాత్రలను పరిచయం చేస్తూ ఇప్పటి వరకు ఒక్కో పోస్టర్ విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదలైంది.

టీజర్ డిఫరెంటుగా ఉంది

టీజర్ డిఫరెంటుగా ఉంది. ఈ చిత్రంలో రవితేజ చెట్టు పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. నాని చేప పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇందులో ఇంకా కాజల్, నిత్యా మీనన్, రెజీనా, శ్రీనివాస్ అవసరాల, మురళీ శర్మ, ప్రియదర్శి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

 కథే హీరో

కథే హీరో

ఈ చిత్రంలో హీరో ఎవరు? అంటే ఎవరూ లేరు.... కథే ఈ చిత్రానికి హీరో అని నాని తెలిపారు. సినిమా కథల ఎంపిక విషయంలో నానికి మంచి అనుభవం ఉంది. అలాంటిది తానే డబ్బులు పెట్టిన నిర్మిస్తున్న ఈ చిత్ర కథ ఎంపిక విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ఉంటారో ఊహించుకోవచ్చు.

కాజల్ లుక్ ఇదే...

‘అ!' మూవీలో కాజల్ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. అయితే ఆమె పాత్ర ఎలా ఉండబోతోంది అనే విషయం మాత్రం ఇంకా వెల్లడించలేదు.

చెట్టు పాత్రలో రవితేజ

‘అ!' సినిమాలోని ముఖ్య పాత్రల్లో చెట్టు పాత్ర కూడా ఒకటి. ఈ పాత్రకు రవితేజ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు.

చెఫ్ పాత్రలో ప్రియదర్శి

‘పెళ్లి చూపులు' ఫేం కమెడియన్ ప్రియదర్శి ఈ చిత్రంలో చెఫ్ పాత్రలో కనిపించబోతున్నారు.

మురళీ శర్మ

‘అ!' మూవీలో ప్రముఖ నటుడు మురళీ శర్మ మెజీషియన్ పాత్రలో కనిపించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X