»   » పవన్ కళ్యాణ్ ‘మాస్’ లుక్

పవన్ కళ్యాణ్ ‘మాస్’ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూర్య, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'మాస్'. సూపర్ నేచురల్ థ్రిల్లర్ జేనర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ప్రణీత సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా మాస్ సెకండ్ లుక్ విడుదల చేసారు.

దీంతో పాటు..... ఇతర హీరోలను ‘మాస్' లుక్ లో మార్ఫింగ్ చేసి సినిమాకు సరికొత్త ప్రచారం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. రజనీకాంత్, పవన్ కళ్యాణ్, అజిత్, విజయ్, విక్రమ్, ధనుష్ ఇలా స్టార్స్ అందరినీ ‘మాస్' లుక్ లోకి మార్చి ఫోటోలు విడుదల చేసారు.

Awesome Pics Of Celebs With 'Masss' Surya Look

ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో నయనతార నటిస్తుండటం మరో హైలెట్. గతంలో ఎక్స్ పిచ్చి వై పిచ్చి అంటూ 'గజిని'లో గ్లామర్ ను పంచిన నయన్ 'ఘటికుడు' మూవీలోనూ సూర్య సరసన నటించింది. ముచ్చటగా మూడోసారి సూర్యతో రొమాన్స్ చేస్తోంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న 'మాస్' మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Awesome Pics Of Celebs With 'Masss' Surya Look

ఈ చిత్రాన్ని కూడా ఈరోస్ సంస్థ దక్కించుకుంది. ఈ సినిమాను సూర్య మరియు ఈరోస్ సంస్థ సంయుక్తంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లుగా తెలిసింది. కమర్షియల్ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ‘మాస్' సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

English summary
Check out, Here are Some Celebs With 'Masss' Suriya Look.
Please Wait while comments are loading...