»   »  ఆయేషా మర్డర్ మిస్టరి కథాంశంతో...

ఆయేషా మర్డర్ మిస్టరి కథాంశంతో...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ramya Krishna
ఈ మథ్య కాలంలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా (విజయవాడ) మర్డర్ మిస్టరీ కథాంశంతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. 'సర్కార్' పేరుతో రూపొందే ఈ సినిమాలో నాగబాబు ప్రధానపాత్ర పోషిస్తున్నాడు. కథ ప్రకారం ఓ లేడీస్ హాస్టల్ ఉంటుంది. హీరో ఒక రోజు ఆ హాస్టల్ వాచ్ మెన్ లేకపోతే అతని బదులుగా డ్యూటీ చేస్తూంటాడు. ఆ సమయంలో అనుకోని విచిత్రాలు జరుగుతాయి. వాస్తవానికి ఈ సినిమా మనోజ్ నైట్ శ్యామలన్ సిక్స్ సెన్స్ ఆధారంగా రూపొందుతోందిట. రమ్యకృష్ణ,నాగబాబు జంటగా ఈ సినిమాలో చేస్తున్నారు.నాగబాబు ఈ సినిమాలో మరణిస్తారుట. అలాగే ఆయేషా గా ఓ కొత్త అమ్మాయ చేస్తోంది. ఆమె ఆత్మ కథలో ఓ ఎపిసోడ్ గా ఉంటుందిట. ఈ చిన్న చిత్రం ద్వారా ఫణిరాజ్ అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X