twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమె బరువు మోయలేకే ఆ హీరో

    By Staff
    |

    Ayesha Takia
    అదేంటో గానీ మొదటనుంచీ ..బరువును కంట్రోల్‌ చేసుకునే విషయంలో అందాల బొద్దు భామ ఆయేషా టకియాకి అన్నీ సమస్యలే. తెలుగులో నాగార్జున సరసన 'సూపర్‌'లో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌ సరసన 'వాంటెడ్‌ డెడ్‌ ఆర్‌ అలైవ్‌' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో రికార్డులు సృష్టించిన 'పోకిరి'కి ఈ సినిమా రీమేక్‌. బోనీ కపూర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకుడు.ఈ సినిమా షూటింగ్‌ కొనసాగుతున్న కాలంలో ఆయషా తన బరువును అదుపు చేసుకోలేక పోవడం సల్మాన్‌కు చికాకు కలిగించింది.

    బ్యాంకాక్‌లో ఒక డ్యూయెట్‌ తీస్తున్నప్పుడు ఆమె మరీ బరువుగా వున్న సంగతి అతడు గ్రహించాడు. అందులోనూ ఆ పాటలో ఆమెను సల్మాన్ ఎత్తుకుని మోయాలి. దాంతో ఆ పాటను రీషూట్‌ చేయల్సిందిగా నిర్మాత బోనీ కపూర్ ని కోరాడు సల్మాన్‌.దానికి బోనీ కూడా అంగీకరించాడు. ఈసారి వాళ్లు ఆయేషాను లాంగ్‌షాట్స్‌లోనే చిత్రీకరించారు. అయితే రీషూట్‌ను బ్యాంకాక్‌లో కాక, ముంబైలో వేసిన సెట్‌లో తీశారు. దీని గురించి ఆయషాని అడిగితే "ఆ సంగతి నాకు తెలీదు. నాకు తెలిసినంతవరకు ఒకదాని తర్వాత ఒకటిగా కొత్త పాటలకే డాన్స్‌ చేశా'' అని చెప్పుకొచ్చింది. బరువు తగ్గించుకోకపోతే..హీరోకే కాక నిర్మాతకూ తిప్పలేనని ఆమె ఎప్పుడు గ్రహిస్తుందో..

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X