Don't Miss!
- News Astrology: రేపటి నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఛీఛీ..తోటి నటులతో, ప్రేక్షకులతో తిట్లు పడాలా?
నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు మీరెందుకు చేయడం లేదు అని మీడియా అడిగిన ప్రశ్నకు...ఛీఛీ అలాంటి పాత్రలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అంటూ మొహమాటం లేకుండా చెప్పేస్తుంది 'సూపర్"బ్యూటీ ఆయేషా టకియా. ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయేషా...ఈ విషయమై మాట్లాడుతూ నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది ఒక్క నెగెటివ్ పాత్రలు తప్ప అని స్పష్టం చేసింది. అలాంటి పాత్రలు చేయడం వల్ల కూడా మంచి పేరు వస్తుంది కదా అని అక్కడున్న విలేకరులు అడగ్గా...అలాంటి పాత్రల వల్ల పేరు రావడం ఏమోగానీ, షూటింగులో తోటి ఆర్టిస్టులతో...ఆ సీన్లు చూసిన ప్రేక్షకులతో తిట్లు తినాల్సి వస్తుందని, అందుకే నాకు అలాంటి పాత్రలు ఇష్టం లేదంటోంది.
ప్రతిభను వెలికి తీసేవి నెగెటివ్ పాత్రలే అని చాలా మంది చెబుతుంటారు, కానీ అలాంటివారి అభిప్రాయాలతో నేనే ఏకీభవించను, నవరసాల్లో ఏ పాత్రలతోనైనా ప్రతిభను నిరూపించుకోవచ్చు అంటూ చెప్పకొచ్చింది. ఇక తన పర్సనల్ లైఫ్ గురించి చెబుతూ పెళ్లి తర్వాత భర్త అనుమతి లేనిదే నటించకూడదనుకున్నాను. నాకు నటనపై ఉన్న ఆసక్తిని అర్థం చేసుకున్న తన భర్త పర్హాన్ అజ్మీ మళ్లీ నటించడానికి ఓకే చెప్పాసారు అని వెల్లడించింది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి తప్పకుండా ప్రత్యేకంగా సమయం కేటాయిస్తానని తెలిపింది. ప్రస్తుతం ఆయేషా నగేష్ కుకునూర్ తీస్తున్న 'Mod"లో నటిస్తోంది.