Adipurush ఆదిపురుష్ మూవీ నిషేధించండి.. అయోధ్య రామాలయ పూజారుల కన్నెర్ర

ఆదిపురుష్ సినిమాను వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. నేపాల్‌లో ఆదిపురుష్‌తోపాటు ఇండియన్ సినిమాలపై నిషేధం కొనసాగుతూనే ఉంది. పలు చోట్ల కొన్ని వర్గాలు ఈ సినిమాపై నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఆ లిస్టులో అయోధ్యలోని మత గురువులు కన్నెర్ర చేశారు. హిందువులు, పురాణాల చరిత్రను వక్రీకరించే విధంగా ఉన్న ఈ సినిమాను నిషేధించాలని ఆయోధ్యలోని మత గురువులు డిమాండ్ చేశారు. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఆదిపురుష్ సినిమాలోని డైలాగ్స్, కొన్ని సీన్లపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రామాయణ కావ్యాన్ని కించపరిచేలా దర్శకుడు ఓం రావత్ ఈ సినిమాను రూపొందించారనే విషయంపై అయోధ్యలోని మత గురువులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి.

Ayodhya Ram Janmabhoomi Head priest Acharya Satyendra Das demands Prabhas Adipurush Ban

రామాయణంలోని పాత్రలను గౌరవ పరిచే విధంగా ఆదిపురుష్ సినిమాలో చిత్రీకరించారు. హిందూ దేవతల పాత్రల ప్రతిష్టను దిగజారేలా చూపించారు. హనుమంతుడికి మీసాలు లేకుండా గడ్డం పెట్టి దారుణంగా చూపించారు. దేశ ప్రజలు భక్తి శ్రద్దలతో పూజించే దేవతలను ఇలాగే చూపిస్తారా? అని అయోధ్యలోని సన్యాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రామజన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యదేవ్ దాస్ స్పందిస్తూ.. రామాయణంలోని పాత్రలను చాలా నీచంగా చూపించారు. హిందూ దేవతలను పూర్తిగా అగౌరవ పరిచారు. డైలాగ్స్ చాలా నాసిరకంగా, పేలవంగా, హిందూ సంస్కృతికి భంగం కలిగించే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాను వెంటనే నిషేధించాలి అని అన్నారు.

Ayodhya Ram Janmabhoomi Head priest Acharya Satyendra Das demands Prabhas Adipurush Ban

రాముడు, రావణుడు, హనుమంతుడి పాత్రలను వాస్తవానికి విరుద్ధంగా చిత్రీకరించారు. పురాణాల్లో చదువుకొన్న, ఇప్పటి వరకు చూసిన సంఘటనలకు విరుద్ధంగా చూపించారు. రామాయణం తెలిసిన వారికి, ఆ పురాణ కథ తెలిసిన వారికి ఆదిపురుష్ సినిమా తప్పకుండా బాధకలుగుతుంది అని అని సత్యదేవ్ దాస్ అన్నారు.

అలాగే హనుమాన్ గర్హి ఆలయ పూజారి రాజు దాస్, మణి రామ్ దాస్ చావని పీత్ స్పందిస్తూ.. హిందూ మతాన్ని కించపరిచేందుకు బాలీవుడ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. హిందువుల సెంటిమెంట్‌ను కాలరాసిన తీరకు ఆదిపురుష్ క్లాసిక్ ఉదాహరణ. కాబట్టి ఈ సినిమాను వెంటనే నిషేధించాలి అని డిమాండ్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X