రెండు కమిటీలు వేసి సెన్సార్ క్లియర్
షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయింది. అయితే ఒక స్వామీజీ వేసిన కేసువల్ల విడుదల ఆలస్యమైంది. కోర్టు సూచన మేరకు సెన్సార్ బోర్డు రెండు కమిటీలు ఏర్పాటు చేసింది. ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆ కమిటీలు స్పష్టం చేశాయి..దాంతో మా చిత్రానికి సెన్సార్ క్లియరెన్స్ దొరికింది అంటున్నారు నిర్మాతలు బి.సుధాకర్‌బాబు, రంగన అచ్చప్పలు. వారు తాజా చిత్రం 'అయ్యారే' విడుదలకు సిద్దమైంది. రాజేంద్రప్రసాద్, శివాజీ హీరోలుగా నటించిన చిత్రం 'అయ్యారే'. అనీషా సింగ్ కథానాయికగా పరిచయమవుతోంది. ఈ నెల 20న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. సెక్స్ స్కామ్ లో ఇరుక్కున్న స్వామి నిత్యానంద తరహా గెటప్ తో రాజేంద్రప్రసాద్ స్టిల్స్ విడుదల చేయటంతో చిత్రం సెన్సార్ లో ఇరుక్కుంది. దాంతో ఇంత లేటైంది.
ఇక చిత్రం గురించి దర్శకుడు సాగర్‌చంద్ర మాట్లాడుతూ .. ఏటీఎమ్ గార్డు, మోటర్ మెకానిక్‌ల మధ్య నడిచే కథ ఇది. అనుకోని పరిస్థితుల్లో వారిలో ఒకరు ఆధ్యాత్మిక గురువుగా అవతారమెత్తాల్సి వస్తుంది. అక్కడి నుంచి అతను చూపించే లీలలు ఏమిటన్నది తెర మీదే చూడాలి అన్నారు. స్వామీజీగా రాజేంద్రప్రసాద్ అభినయం ప్రేక్షకుల్ని మంత్రముగ్థుల్ని చేస్తుంది. ఆ గెటప్‌లో తెరమీద ఆయనను చూడగానే ప్రేక్షకుల పెదవులపై చిరునవ్వులు విరబూయడం ఖాయం. ఆ ఆశ్రమం ఎపిసోడ్ ఆద్యంతం తమాషాగా, ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తుంది అని తెలిపారు. సునీల్ కాశ్యప్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్. ఇందులో మొత్తం 5 పాటలుంటాయి. అందరికీ నచ్చే సినిమా అవుతుంది అని చెప్పారు. సాయికుమార్, అనీషా సింగ్, డా. శివప్రసాద్, ఎమ్మెస్ నారాయణ, అలీ, హర్షవర్థన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: నివాస్, కెమెరా: భాస్కర్ సామల, ఆర్ట్: పార్థసారధి వర్మ, ఎడిటింగ్: ప్రవీణ్ పి.కుమార్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: బిక్షపతి తుమ్మల.


Click it and Unblock the Notifications











