twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమె లోదుస్తులు అలాంటివే.. జయప్రద‌పై దారుణమైన కామెంట్.. భగ్గుమన్న మహిళా సంఘాలు

    |

    Recommended Video

    Actor Jaya Prada commented By Azam khan || Filmibeat Telugu

    రాజకీయాల్లో తామ అనుకొన్న ఫలితాన్ని సాధించడానికి నేతలు ఎంతకైనా తెగిస్తారనేది తెలిసిందే. తాజాగా ఓ నేత సినీ నటి జయప్రదపై దారుణమైన కామెంట్లు చేయడం మరోసారి చర్చకు దిగింది. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి జయప్రద బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. అయితే ఒకనాటి మిత్రుడు, తన ప్రత్యర్థి అజంఖాన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో సెన్సేషనల్‌గా మారాయి. జయప్రదపై ఆయన చేసిన ఆరోపణలు ఏమిటంటే..

     ఆమె లోదుస్తులుగా ఖాకీ నిక్కరు

    ఆమె లోదుస్తులుగా ఖాకీ నిక్కరు

    రాంపూర్‌లో పోటీ చేసేందుకు తీసుకొచ్చి నేను రాజకీయ జన్మను ప్రసాదించాను. ఆమెను ఎవరూ టచ్ చేయకుండా ఆమెకు రక్షణ కల్పించాం. ఆమె అసలు రూపం, నైజం తెలుసుకోవడానికి నాకు 17 ఏళ్లు పట్టింది. ఆమె గత 17 రోజులకుగా ఖాకీ నిక్కరును లోదుస్తులుగా ధరిస్తున్నది అని అజయ్ ఖాన్ ఆరోపించారు.

    ఆమె నైజం బయటపడిందని

    ఆమె నైజం బయటపడిందని

    జయప్రదను రాంపూర్‌కు తీసుకువస్తే ఆమె రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తగా మారిపోయింది. ఇప్పుడు ఆమె లోదుస్తులు కూడా ఖాకీ రంగువే ధరిస్తున్నది. అలాంటి నైజం ఇప్పుడు బయటపడింది అని అజమ్ ఖాన్ విమర్శించాడు. ఒకవేళ నా ఆరోపణల్లో తప్పు ఉంటే రాజకీయాల్లో నుంచి తప్పుకొంటాను అని సవాల్ విసిరారు.

    గతంలో కూడా జయప్రదపై కామెంట్లు

    గతంలో కూడా జయప్రదపై కామెంట్లు

    గతంలో కూడా జయప్రదను ఉద్దేశించి అజయ్ ఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమెపై మూకుమ్మడి దాడికి కూడా ప్రయత్నించారు. తాజాగా తనపై అజయ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై జయప్రద ఇంకా స్పందించలేదు. అజయ్ ఖాన్ వ్యాఖ్యలు చేసిన సభలో సమాజ్ వాదీ అధినేత అఖిలేష్ యాదవ్, ఇతర ప్రధాన నేతలు ఉండటం గమనార్హం.

     భగ్గుమన్న మహిళా, ఇతర నేతలు

    భగ్గుమన్న మహిళా, ఇతర నేతలు

    జయప్రదపై అజమ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి చంద్రమోహన్, జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ స్పందించారు. అజమ్ వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరం. మహిళలను కించపరిచే విధంగా ఉంది అని చంద్రమోహన్ అన్నారు. జయప్రదను ఉద్దేశించి లోదుస్తులపై వ్యాఖ్యలు చేయడం ఆయన దిగజారుడుకు నిదర్శనం అని రేఖా శర్మ మండిపడ్డారు. అయితే తన ఆమెను కించపరచడం నా ఉద్దేశం కాదని అజయ్ ఖాన్ వివరణ ఇచ్చారు.

    English summary
    Azam Khan clarified that he did not make any objectionable remarks against actress-turned-politician Jaya Prada, who is contesting the Lok Sabha polls 2019 from the Rampur constituency on the BJP ticket.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X