Don't Miss!
- Sports ధోనీ సార్ ధోనీ.. అంతే: సౌండ్ లెవెల్ ఏ రేంజ్లో ఉందంటే..
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘అజర్’ మూవీ మేకింగ్: అజారుద్దీన్‌తో స్వయంగా ట్రైనింగ్ (వీడియో)
హైదరాబాద్: ప్రముఖ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో ఇమ్రాన్ హస్మి హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి టోనీ డిసౌజా దర్శకత్వం వహిస్తున్నారు. 'అజర్' అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. 'ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్' అనేది ట్యాగ్ లైన్.
ఈ సినిమాలో ఇమ్రాన్ హస్మి అజారుద్దీన్ పాత్రలో కనిపించబోతున్నాడు. క్రికెట్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో.... ఇమ్రాన్ అజారుద్దీన్ స్టైయిల్‌లో బ్యాటింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం స్వయంగా అజారుద్దీనే వచ్చి ఇమ్రాన్‌కు ట్రైనింగ్ ఇచ్చారు. సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ వీడియోను రిలీజ్ చేసారు.
'అజర్' చిత్రంలో....అజారుద్దీన్ క్రికెట్లో అంచలంచెలుగా ఎదిగిన ఘట్టాలు....మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం తర్వాత అతను ఎదుర్కొన్న పరిస్థితులును ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నారు. ఇందులో అజారుద్దీన్ ప్రేమ వ్యవహారం, పెళ్లి అంశాలను కూడా ఇంట్రెస్టింగ్ గా చూపించబోతున్నపారు.
ఆ మధ్య విడుదలైన టీజర్లో.... నేను మూడు కారణాలు వలన బాగా ఫేమసయ్యాను. దేముడ్ని నమ్మడం, పెళ్లి, మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ అజర్ డైలాగు చెప్పారు. అవే ఇప్పుడు క్రికెట్ వీరాభిమానులను, సినీ అబిమానులను తన వైపు తిప్పుకుని, ఆలోచనలో పడేలా చేసాయి. అజారుద్దీన్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాతి పరిస్థితులను కూడా చూపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఇమ్రాన్ క్రికెట్లో మెళకువలు నేర్చుకున్నాడు. ముఖ్యంగా అజారుద్దీన్ బ్యాటింగ్ శైలి బాగా ప్రాక్టీస్ చేసారు.
ప్రముఖ దర్శకుడు... అజార్ కు అత్యంత ఆప్తుడిగా పేరున్న వ్యక్తి ఆంటోనీ డిసౌజా. క్రికెటర్ జీవితాన్ని దగ్గర నుంచి పరిశీలించిన ఆంటోనీ సినిమాను వాస్తవానికి దగ్గరగా తీర్చిదిద్దగలడన్న నమ్మకంతో దర్శకత్వం బాధ్యతలను అప్పగించారట. ఈ బయోపిక్ ను కేవలం డ్రామాగా తీర్చిదిద్దబోవడంలేదని తెలిపిన చిత్ర బృందం... సినిమాకు అన్ని కమర్షియల్ హంగులూ అద్దబోతున్నట్లు వెల్లడించింది. మే 13న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.