బర్త్ డే స్పెషల్: యామి గౌతమ్ హాట్ పిక్స్(ఫోటోస్)
హైదరాబాద్: నటి యామి గౌతం గురించి మీకు గుర్తుండే ఉంటుంది. రవిబాబు నువ్విలా చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన యామి గౌతం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటోంది. నవంబర్ 28, 1988లో జన్మించిన యామి గౌతం నేటితో 26వ వసంతంలోకి అడుగు పెడుతోంది.
యామి గౌతం గురించి పర్సనల్ లైఫ్ విషయాల్లోకి వెళితే హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్‌పూర్లో జన్మించింది. చండీగర్‌లో పెరిగింది. ప్రముఖ లీడింగ్ పంజాబీ ఛానల్ వైస్ ప్రెసిడెంట్ అయిన ముఖేష్ గౌతం ఆమె తండ్రి. సినిమా స్టార్ కావాలని కలలుగన్న యామి తన 20వ ఏటనే ముంబై బాట పట్టింది.
చాంద్ కె పార్ చలో అనే టీవీ షో ద్వారా తన కెరీర్ ప్రారంభించింది. వివిధ టీవీ కార్యక్రమాల తర్వాత ఆమె దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. కన్నడ చిత్రం ఉల్లాస ఉత్సాహలో అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగులో ‘నువ్విలా' చిత్రంలో నటించింది. తర్వాత ఆమె వరుస సినిమాల్లో బిజీ అయిపోయింది. ప్రస్తుతం తెలుగులో నితిన్ సరసన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్' చిత్రంలో చేస్తోంది. దీంతో పాటు ఓ రెండు హిందీ సినిమాలు, ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

ఫిల్మో గ్రఫీ
ఇప్పటి వరకు యామీ గౌతం ఆరు బాషల్లో...పంజాబి, తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించింది.

ఐఏఎస్ ఆఫీసర్
వాస్తవానికి యామీ గౌతం తన చిన్నతనంలో ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంది. కాలనుగుణంగా ఆమె నిర్ణయం మారింది. సినిమాల్లోకి వచ్చింది.

ఆయుష్మాన్ ఫ్యామిలీ ఫ్రెండ్?
వికీడోనర్ చిత్రం ద్వారా యామి గౌతం బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్ర హీరో ఆయుష్మాన్ ఖురానా ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్.

సాఫ్ట్ నేచర్
యామి గౌతం చాలా సాఫ్ట్ నేచర్ కలిగిన వ్యక్తి. ఆమె స్నేహితులంతా ఇదే విషయం చెబుతున్నారు.

ఫ్యామిలీ బ్యాగ్రౌండ్
హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్‌పూర్లో జన్మించింది. చండీగర్‌లో పెరిగింది. ప్రముఖ లీడింగ్ పంజాబీ ఛానల్ వైస్ ప్రెసిడెంట్ అయిన ముఖేష్ గౌతం ఆమె తండ్రి.

బాలీవుడ్
యామి చదువు అంటే చాలా ఇష్టం అయితే సినిమాల్లో నటించాలనే కోరికతో చదువులకు స్వస్తి చెప్పింది. ప్రస్తుతం పార్ట్ టైం గ్యాజ్యుయేషన్ కోర్సు చేస్తోంది.

ఫేవరెట్ ఫుడ్
ఆమెకు పహారీ, పంజాబి రుచులు అంటే చాలా ఇష్టం. చంబా కా రాజ్మా చాలా ఇష్టంగా తింటుంది.

హాబీస్
ఇంటీరియర్ డెకరేషన్ విషయాలు తెలుసుకోవడం, మ్యూజిక్ వినడం లాంటివి హాబీస్.

బాలీవుడ్ జర్నీ
తన 20వ ఏట సినిమా స్టార్ కావాలని ముంబై బాట పట్టింది. ప్రస్తుతం వివిధ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది.

హాట్ అండ్ క్యూట్
హాట్ అండ్ క్యూట్ లుక్‌తో యామి గౌతం ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో అజయ్ దేవగన్ సరసన యాక్షన్ జాక్సన్ చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











