twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    10 రీజన్స్ : రామ్ చరణ్ ని ఎందుకు అభిమానించి, గౌరవించాలంటే..

    By Srikanya
    |

    హైదరాబాద్ : మెగా పరర్ స్టార్ రామ్ చరణ్ తన 31 వ పుట్టిన రోజుని ఈ రోజు జరుపుకుంటున్నారు. ఆయన ఓ స్టార్ గా,మెగాస్టార్ కొడుకుగా మాత్రమే కాకుండా ఆయన్ను గుర్తు చేసుకుని శుభాకాంక్షలు చెప్పటానికి కారణాలు బోల్డు ఉన్నాయి. రామ్ చరణ్ గొప్ప వ్యక్తిత్వం, ఆయన మంచి హృదయం ఆయన్ను అందరివాడిగా చేసాయి.

    గోల్డెన్ స్పూన్ తో పుట్టి నా, నటుడుగా ఆయన ఈరోజు అనుభవిస్తున్న స్టార్ డమ్ ఊరికినే వచ్చేయలేదు. తొలిసినిమా మార్నింగ్ షో వరకే ఆయన తండ్రి ఛరిష్మా పనిచేసింది. ఆయన ఫ్లాఫ్ సినిమాలకు ఒక్క రోజు కలెక్షన్స్ పెంచటానికి కూడా ఆయన వారసత్వం పనికిరాలేదు. ఇది కెరీర్ తొలినాళ్లలో గమనించారు కాబట్టే ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.

    రామ్ చరణ్ వివరణ: ఉపాసన తో విడాకులు, సానియా మీర్జాతో లింకా?రామ్ చరణ్ వివరణ: ఉపాసన తో విడాకులు, సానియా మీర్జాతో లింకా?

    అలాగే రామ్ చరణ్ తన మెచ్యూరిటీ లెవిల్స్ తో చేసే సామాజిక కార్యక్రమాలతో అందరి హృదయాలను గెలుచుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన మంచి పనులు, కొన్ని బయిటకు వచ్చినవి మీకు కొన్ని అందిస్తున్నాం...

     లైఫ్ సేవ్

    లైఫ్ సేవ్

    రెండు జీవితాలని సేవ్ చెయ్యండంలో కీలకంగా వ్యవహారించాడు చెర్రి. తనుకు ఇష్టమైన కొరియోగ్రాఫర్ అయిన జానీ మాస్టర్ భార్య గర్బవితితో వుండగా, హాస్పటల్ ఖర్చులన్ని భరించాండు చరణ్. తల్లి, బిడ్డా క్షేమం అని తెలిసేదాకా ఆయన ఎప్పటికప్పుడు ఇన్పర్మేషన్ తీసుకుంటూనే ఉన్నారు. ఇది నిజంగా తన కెరీర్ లో మర్చిపోలేని సంఘటన జానీ మాస్టర్ పెర్కొన్నాడు.

    మెచ్యూరిటీ

    మెచ్యూరిటీ

    తన తండ్రి చిరంజీవి ఓ పక్క, బాబాయ్ పవన్ కళ్యాణ్ మరోపక్క ఎవరిదారిలో వారు...తమ పోలిటికల్ కెరీర్ లు నిర్మించుకుంటూ, విభేధాలకు తావిచ్చినప్పుడు... వారిద్దరిని మెగా 60 సెలబ్రెషన్స్ లో కలిపి, వాళ్లను డీల్ చేసిన విధానంలో చెర్రి మెచ్యూరిటి లెవిల్స్ బాగా కనిపిస్తాయి. ఇదంతా తన ఫ్యామిలికోసం చేసాడు.

    స్వ విమర్శ

    స్వ విమర్శ

    తనపై తానుగా విమర్శించుకుంటూంటాడు. తను చెసిన సినిమాలల్లో తనకు నచ్చనివి చాలానే వున్నాయని, ఫ్లాప్స్ వచ్చాయని వాటినుండి పారిపోకుండా, ధైర్యంగా నిలబడటం తనకున్న ప్రత్యకత అని అంటూంటాడు. తీసుకునే ప్రతి నిర్ణయంలో ఖచ్చితత్వాన్ని పాటిస్తానంటాడు.

    కైండ్ హార్ట్

    కైండ్ హార్ట్

    చెర్రికి వీరాభిమాని అయిన ఓ చిన్న కుర్రాడు స్కూల్ కు వెళ్ళే పోజిషన్ లేకపోతే, ఆ వీడియో సోషల్ మీడియాలో చూసి, ఆకుర్రాడిని స్కూల్ కి పంపించడంలో తను వంతు సహాయం చేసాడు. ఇది నిజంగా కైండ్ హార్ట్ ఆఫ్ చెర్రి.

    రూమర్స్ పై

    రూమర్స్ పై

    తన ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉపాసనను, కేవలం డబ్బుకోసం చేసుకున్నాని అందరు అనుకుంటున్నారు. అది తప్పని, నిజంగా తనను ప్రేమించానని, లెక్కలు చూసుకుని ప్రేమించలేదని, తన చదువు, ప్యామిలి, హెల్త్, ప్రేమ మరియు కెరీర్ కు సంబందించి సవివరంగా ఓ కాలేజ్ ఫంక్షన్ లో తెలిపాడు.

    నిస్వార్దంగా

    నిస్వార్దంగా

    మహేష్, నాని, ఎన్టీఆర్ అఖిల్ ఇలా ఎవరినైనా తనకు నచ్చితే వెంటనే వారికి ఫోన్ చేసి , వారిని మెచ్చుకుంటూనే వుంటాడు. అంతేకానీ వారిని తను పోటీగా ఫీలై దూరం పెట్టడం అనేది జరగదు. ఇది నిజంగా గొప్పవిషయమే.

    హంబుల్

    హంబుల్

    తను ఎప్పటికీ తన తండ్రినికానీ, బాబాయ్ పవన్ ను గాని చేరలేనని, కానీ వారి సరసన నిలబడటానికి ప్రయత్నిస్తుంటానని తెలిపాడు తన మెగా 60 ఫంక్షన్ లో.

    ఓపెన్ గానే

    ఓపెన్ గానే

    రామ్ చరణ్ తన డాన్స్ తో అటు ఫ్యాన్స్ ను, ఇటు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంటాడు. తన తండ్రి చేసినంతగా నేను చెయ్యలేనని ఓపెన్ గానే చెపుతుంటాడు. అంతేనా..తను కాకుండా.. ఎవరు డాన్స్ బాగా చేసినా వారిని మెచ్చుకుంటాడు.

    మాస్ హీరో

    మాస్ హీరో

    చెర్రి గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు, ఎందుకంటే తన సినిమాలు ఖచ్చితంగా మాసివ్ గా వుంటాయి. కావలసినంత ఫన్ చెస్తాడు. వన్ ఆప్ ది మెస్ట్ లవ్డ్ స్టార్ ఇన్ టాలీవుడ్.

    ప్రోడ్యూసర్స్ హీరో

    ప్రోడ్యూసర్స్ హీరో

    మంచి కమర్శియల్ హీరోగానే వున్నాడు రామ్ చరణ్. ప్రోడ్యూసర్ ని సేఫ్ జోన్ లో వుంచుతాడు ఈ హీరో...అందుకే ఈ హీరోతో సినిమా చెయ్యాడానికి ప్రోడ్యూసర్స్ చాలా ఇంట్రస్ట్ చూపిస్తుంటారు.

    English summary
    More than a star, and a star kid, Ram Charan has earned a few brownie points from the people of Telugu states, for his philanthropy and great heart.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X