For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బేర్ బాడీతో :బిపాసా బసు... సూపర్ హాట్ పిక్స్ (ఫొటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్ : అందంతో అదరగొట్టడం, నటనతో అలరించడమే కాదు. తరచు ఏదొక విషయమై వార్తల్లో నిలిచే తార బిపాసా బసు. ఇప్పుడు తన పాత్రల ఎంపికలో కూడా వైవిధ్యం చూపుతూ తన కెరీర్ ని మలుచుకుంటోంది. ఈ రోజు (7 జనవరి, 1979) న జన్మించిన ఈమె 36 సంవత్సరాలు అంటే ఎవరూ నమ్మరు. ఇప్పటికి ఆమె తమ కెరీర్ లో దూసుకుపోతు...ఈ నెల 16న తన కొత్త చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది.

  పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

  నాకా.. పెళ్లా.. అప్పుడేనా.. అంటూ బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాసా బసు నవ్వేస్తోంది. బోయ్ ఫ్రెండు హర్మన్ బవేజాతో తనకు నిశ్చితార్థం జరిగిపోయిందంటూ వచ్చిన కథనాలను బిపాసా కొట్టిపారేసింది. ఇప్పుడప్పుడే తన పెళ్లికి వచ్చిన తొందరేమీ లేదని, ప్రస్తుతం తాను నటన మీదే దృష్టి సారించానని చెబుతోంది. పెళ్లిని తాను చాలా గౌరవిస్తానని, కానీ దానికి ఇంకా చాలా టైం ఉందని చెప్పింది. తాను చాలా ప్రశాంతంగా ఆ పని చేస్తానంది.

  ఇక ‘క్రియేచర్‌ 3డి' సినిమాలో వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలున్నాయి. మూడో సినిమాకు డేట్స్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందీ బ్లాక్‌ బ్యూటీ.

  కొంతకాలంగా హాట్‌ రోల్స్‌లో కనిపించని బ్లాక్‌ బ్యూటీ బిపాషా బసు ‘అలోన్‌' సినిమాతో మరోసారి రసిక జనాన్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో సహ నటుడు కరణ్‌సింగ్‌ గ్రోవర్‌తో కొన్ని ‘ఇంటిమేట్‌ సీన్స్‌'ను ఆమె చేయబోతోంది. ఇమ్రాన్‌ హష్మితో ‘రాజ్‌ 3' సినిమాలో శృంగార సన్నివేశాలు చేశాక మళ్లీ అలాంటి సన్నివేశాలు ఆమె చేయబోతోంది ‘అలోన్‌'లోనే. ఈ విషయాన్ని ఈ బెంగాలీ భామ స్వయంగా ధృవీకరించింది.

  ‘‘సూపర్‌నేచురల్‌ హారర్‌ ఫిల్మ్‌గా ‘అలోన్‌' తయారవుతోంది. అయితే ఇందులో అందమైన ప్రేమకథ కూడా ఉంది. ఇది చాలా ఎమోషనల్‌ లవ్‌ స్టోరీ. మళ్లీ శృంగార బిపాషాగా ఎప్పుడు కనిపిస్తావని చాలా మంది నన్ను అడుగుతున్నారు. చాలా రోజుల తర్వాత వాళ్లు ఆశిస్తున్నది ‘అలోన్‌'లో దొరుకుతుందని అనుకుంటున్నా. ఇవాళ మామూలు రొమాంటిక్‌ కామెడీల్లోనే లవ్‌మేకింగ్‌ సీన్లు, ముద్దు సీన్లు ఉంటున్నాయి. ఇక ‘అలోన్‌' వంటి ప్రేమకథలో అవి మరింత ఎక్కువగా ఉంటాయి'' అని చెప్పింది బిపాషా. ఇక ఆమె అభిమానులకు పండగేనన్న మాట.

  ఆమె హాట్ ఫొటోలు...స్లైడ్ షోలో...

  వరస హిట్స్

  వరస హిట్స్

  ‘జిస్మ్‌', ‘రాజ్‌', ‘కార్పొరేట్‌', ‘అప్‌హరణ్‌', ‘ధూమ్‌ 2', ‘లమ్‌హా', ‘ఆక్రోశ్‌', ‘రేస్‌' సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి.

  ఎవరూ బిపాషా బసు కాలేరు

  ఎవరూ బిపాషా బసు కాలేరు

  ‘‘ఇవాళ వస్తున్న తారలకు ఇండస్త్రీలో భిన్న పరిస్థితులు ఉంటున్నాయి. తామేమిటో జనానికి నిరూపించుకోవడమే కాక, తమకంటూ ఓ స్థానాన్ని వాళ్లు సంపాదించుకోవాలి. కొత్త హీరోయిన్ల వల్ల నాకు ప్రమాదముందని నేను భావించట్లేదు. నా కెరీర్‌లో ఇవాళ నేనున్న స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. ఎవరూ బిపాషా బసు కాలేరు'' అని తేల్చిచెప్పింది.

  ఆహార శైలి

  ఆహార శైలి

  ఆహారశైలిలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత. రొటీన్‌ఫుడ్‌ మీద ఎప్పుడు బోర్‌ కొట్టినా బెంగాలీ వంటకాలను ఆస్వాదిస్తుంది బిపాసా బసు. కప్పు తెల్లన్నం, రోటీలు, రుచికరమైన కూరలు, స్వీట్లు తన మనసును లాగేస్తాయని చెప్పింది.

  కెరీర్ మీదే..

  కెరీర్ మీదే..

  తనకు నిశ్చితార్థం జరిగిందంటూ వస్తున్న వార్తలను బ్లాక్‌ బ్యూటీ బిపాషా బసు ఖండించింది. తన దృష్టి ప్రస్తుతం పెళ్లి మీద లేదనీ, కెరీర్‌ మీదే ఉందనీ స్పష్టం చేసింది.

  ఇంకా సమయముంది

  ఇంకా సమయముంది

  ‘‘పెళ్లిని ఓ సంప్రదాయ వ్యవహారంగా నేను గౌరవిస్తాను. అయితే దానికి ఇంకా సమయముంది. ఆ సమయం వచ్చినప్పుడు ప్రశాంతంగా పెళ్లి చేసుకుంటాను. ప్రస్తుతం నా చేతిలో సినిమాలున్నాయి. నటనతో పాటు నేను చేయాల్సిన పనులు మరికొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడే చెప్పలేను'' అని తెలిపింది బిపాషా.

  తొలి సినిమా

  తొలి సినిమా

  ‘ ఎలోన్' సినిమా విజయంపై గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్న ఆమె 2001లో ‘అజ్‌నబీ' సినిమాతో కెరీర్‌ ప్రారంభించింది.

  మేం కలిసే ఉన్నాం

  మేం కలిసే ఉన్నాం

  తాను విడిపోయామనే వార్తలు వస్తుండటంతో ‘‘మేం కలిసున్నా, లేకపోయినా మేం ఒకరినొకరం ఎప్పటికీ గౌరవించుకుంటూనే ఉంటాం'' అని ప్రకటించారు బిపాషా, హర్మాన్‌.

  రానా గురించి...

  రానా గురించి...

  విక్రమ్‌ ఫద్నిస్‌ డైరెక్ట్‌ చేస్తున్న ‘నియా' సినిమాలో బిపాషా సరసన హీరోగా రానా ఎంపికయ్యాడు. ‘దమ్‌ మారో దమ్‌' చేసే టైమ్‌లో ఆ ఇద్దరి మధ్యా రొమాన్స్‌ నడుస్తుందనే వదంతులు రావడం, వాటిని ఆ ఇద్దరూ ఖండించడం తెలిసిందే.

  ఆమెను...

  ఆమెను...

  25 ఏళ్ళగా బాలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ర్టీలో మోడల్‌గా, ప్యాషన్‌ డిజైనర్‌గా చక్కని గుర్తింపు పొందిన విక్రమ్‌ ఫడ్నీస్‌ ఇప్పుడు దర్శకుడిగా మారబోతున్నారు. మూడేళ్ళగా తయారు చేసిన ఈ కథకు హీరోయిన్ గా బిపాసాను ఎంపిక చేసుకున్నారు.

  మోడ్రన్ మదర్

  మోడ్రన్ మదర్

  అయితే ఇందులో ఆమె గ్లామర్‌ డాల్‌గానో, ఐటమ్‌ గాళ్‌గానో కాకుండా మోడ్రన్‌ మదర్‌గా కనిపించనుందట. సెలబ్రిటీ లైఫ్‌, ఫ్యామిలీ జర్నీ నేపధ్యంలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే బిపాసా ఈ కథ విని అంగీకరించినట్లు బాలీవుడ్‌ సమాచారం. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉందీ ముద్దుగుమ్మ. తన డేట్స్‌ అడ్జస్ట్‌ అయ్యాక 2015, జనవరి తరువాత ఈ సినిమా సెట్స్‌ మీదకెళ్ళబోతుందని విక్రమ్‌ ఫడ్నీస్‌ తెలిపారు.

  English summary
  Bipasha Basu who was born on 7th January, 1979 turns 36 years old today. The actress is gearing for a career-breaking horror movie that'll be releasing on 16th January.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X