పరుచూరి గోపాలకృష్ణగారి బలహీనత అదేట
ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ బలం, బలహీనలతలు గురించి ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ చెప్పుకొచ్చారు. బి.గోపాల్ మాటల్లోనే.... గోపాలకృష్ణ గారి బలం చేతిలోని కలం. దాని స్పీడు అలాంటిది. కత్తిలాంటి డైలాగులు రాస్తుంది. క్షణాల్లో మాక్కావాల్సిన మాటల్ని అందిస్తుంది. ఇక బలహీనత అంటారా..ముందు వెనక ఆలోచించకుండా అడిగిన వారికల్లా సహాయం చేయడం అన్నారు. అలాగే పరుచూరి గోపాలకృష్ణ గారి కలానికున్న దమ్ము గురించి చెప్పాలంటే ఒక సంఘటన చెబుతాను. ఇంద్ర సినిమా షూటింగ్ లక్నోలో జరుగుతోంది.
ఒక సన్నివేశంలో ఒక బలమైన, పదునైన డైలాగ్ కావాల్సి వచ్చింది. చిరంజీవిగారు కూడా ఒక మంచి డైలాగ్ కావాలని అన్నారు. వెంటనే గోపాలకృష్ణగారికి ఫోన్ చేశాను. సీన్ చెప్పాను. ఒక నిమిషం ఆలోచించి చెప్పారు. "తప్పు మా పక్క ఉంది కాబట్టి ఊరుకున్నాను. లేకపోతే తలలు తీసుకుని వెళ్లేవాణ్ణి" అని చెప్పారు. అందరం ఆశ్చర్యపోయాం. చిరంజీవిగారికి తెగ నచ్చేసింది ఆ డైలాగ్. సన్నివేశానికి తగ్గట్టు మాటను తూటాలా పేల్చే కళ కేవలం వారికొక్కరికే సొంతం అంటున్నారు బి.గోపాల్. ప్రస్తుతం బి.గోపాల్..గోపీచంద్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











