twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా మాస్ డైరక్టర్ తో గోపీచంద్ నెక్ట్స్

    By Srikanya
    |

    మాస్ స్టార్ గోపీచంద్ త్వరలో మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బి.గోపాల్ దర్శకత్వంలో నటించనున్నారు. సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర వంటి మెగా హిట్స్ ఇచ్చిన బి గోపాల్ గత కొంత కాలంగా సరైన కథ కోసం అన్వేషిస్తున్నారు. ఈ లోగా ఎమ్.ఎస్. రాజు నిర్మాతగా మస్కా చేసారు. అయితే అది అనుకున్న ఫలితం ఇవ్వలేదు. దాంతో మరికొంత కసరత్తు చేసి చేసిన కథతో గోపీచంద్ ని ఎప్రోచ్ అయ్యారు. గతంలో లక్ష్యం వంటి సూపర్ హిట్ ఇచ్చిన నల్లమలుపు బుజ్జి నిర్మాతగా ఈ చిత్రాన్ని ఫైనలైజ్ చేసారు. ప్రస్తుతం గోపీచంద్ ...పూరీ కాంబినేషన్ లో గోలీమార్ చిత్రం రూపొందుతోంది. ప్రియమణి హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ఎనకౌంటర్ స్పెషలిస్టు కథాంశంగా రూపొందుతోంది. ఈ చిత్రం అనంతరం బి.గోపాల్ కాంబినేషన్ మొదలవుతుందని తెలుస్తోంది. మరో ప్రక్క నల్లమలుపు బుజ్జి...వెంకటేష్ తో గంగా..ది డాన్ అనే చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. కానీ అది ఎందుకునే కార్యరూపం దాల్చలేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X