బి గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్ కన్ఫర్మ్
మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బి.గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్ చిత్రం కన్ఫర్మ్ అయింది. మస్కా చిత్రానికి కథ అందించిన సూర్య అనే రైటర్ ఇచ్చిన కథతో ఈ చిత్రం రూపొందనుంది. గతంలో గోపిచంద్ తో లక్ష్యం వంటి సూపర్ హిట్ ఇచ్చిన నల్లమలుపు బుజ్జి నిర్మాతగా ఈ చిత్రాన్ని ఫైనలైజ్ చేసారు. వచ్చే నెల 7వ తేదీ నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని నిర్మాత బుజ్జి మీడియాకు తెలియచేస్తూ...వైవిధ్యమైన కలయిక ఇది. అగ్రకథానాయకులతో బి.గోపాల్ చిత్రాలు రూపొందించారు. ఆయన దర్శకత్వంలో గోపీచంద్ తొలిసారి నటిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ మెప్పించేలా కథను తీర్చిదిద్దామన్నారు. ప్రస్తుతం గోపీచంద్...పూరీ కాంబినేషన్ లో గోలీమార్ రూపొందిన గోలీమార్ చిత్రం రిలీజ్ కు రెడీగా ఉంది. ప్రియమణి హీరోయిన్ గా చేసిన ఈ చిత్రంలో గోపీచంద్ ఎనకౌంటర్ స్పెషలిస్టుగా కనిపిస్తారు. ఇక బి.గోపాల్ చిత్రానికి సమర్పణ..భవ్య, సంగీతం..మణిశర్మ, ఛాయాగ్రహణం..రసూల్ ఎల్లోర్ అందించనున్నారు.


Click it and Unblock the Notifications











