ఏప్రిల్ 15నుంచి గోపీచంద్ కొత్త చిత్రం..

ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ ''యాక్షన్, వినోదం మేళవింపుతో తెరకెక్కుతున్న చిత్రమిది. 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు', 'ఇంద్ర' లాంటి చిత్రాల్ని రూపొందించిన బి.గోపాల్ ఈసారి గోపీచంద్‌ని ఓ కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పాటల్ని విదేశాల్లో చిత్రీకరిస్తాం. గోపీచంద్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా చిత్రం తయారవుతుంది. ఏకధాటిగా టాకీపార్ట్ పూర్తి చేస్తాం. పాటలను విదేశాల్లో చిత్రీకరిస్తాం. ఇతర నటీనటులు సాంకేతిక బృందం వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తాము''అన్నారు.
ప్రస్తుతం గోపీచంద్ ప్రస్తుతం 'జాక్‌పాట్' చిత్రంలో నటిస్తున్నారు. ఆ తరవాత నటించే చిత్రానికి బి.గోపాల్ దర్శకత్వం వహిస్తారని సమాచారం. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు సాగుతున్నాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
నిజానికి 2010లోనే ఈ ప్రాజెక్టు ప్రారంభం కావాల్సి ఉంది. అప్పుడే మస్కా రైటర్ చెప్పిన కథని బి.గోపాల్ ఓకే చేసి గోపీచంద్ తో సినిమా అనుకునన్నారు. అప్పట్లో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేసారు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల వర్కవుట్ కాలేదు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఈ కాంబినేషన్ తెరకెక్కుతుందని తెలుస్తోంది.
తెలుగులో అగ్రహీరోలందరితో పనిచేసిన సీనియర్ దర్శకుడు బి.గోపాల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనుండటంతో ప్రాజెక్టుపై క్రేజ్ ఏర్పడుతోంది. గోపీచంద్, గోపాల్ తొలి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మాస్‌ని, క్లాస్‌ని ఆకట్టుకునే విధంగా ఉండనుంది. గోపీచంద్ బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా ఉండే కథను ఎన్నుకుని గోపాల్ ఈ సినిమాని తీర్చిదిద్దబోతున్నారు.


Click it and Unblock the Notifications











