బి. నాగిరెడ్డి ఫిల్మ్ అవార్డ్స్
అలనాటి ప్రముఖ నిర్మాత బి. నాగిరెడ్డి శతయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆయన కుమారులు వేణుగోపాల్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి భారీ ఎత్తున నాగిరెడ్డి శతజయంతి ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఏటా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన రెండు ఉత్తమ వినోదాత్మక చిత్రాలకు నాగిరెడ్డి స్మారక పురస్కారం ఇవ్వనున్నారు. ఈ మేరకు 2011లో విడుదలైన తెలుగు, తమిళ చిత్రాలకు సంబంధించి ఎంట్రీల ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు.
ఫిబ్రవరి 15ఎంట్రీలకు చివరి తేదీ. తెలుగు సినిమాకు ఏప్రిల్ 7న హైదరాబాద్‌లోను, తమిళ సినిమాకు మే 1న చెన్నైలోనూ బహుమతులు అందజేస్తామని వేణుగోపాల్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఒక్కో భాషా చిత్రానికి లక్షాయాభై వేలు నగదు బహుమతి ఉంటుందని, రెండు భాషలకు చెందిన సినీరంగ ప్రముఖులే విజేతలను నిర్ణయిస్తారని వారు ప్రకటించారు.
నాగిరెడ్డి తెలుగులో పాతాళ భైరవి, మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మకథ వంటి ఎన్నో అపురూప చిత్రాలను నిర్మించారు.


Click it and Unblock the Notifications











