బీ విఠలాచార్య ఫాదర్ ఆఫ్ తెలుగు మాస్ సినిమా.. చరిత్రను రికార్డు చేయడం.. త్రివిక్రమ్ శ్రీనివాస్

తెలుగు సినిమా పరిశ్రమలో 70, 80 దశకంలో అద్బుతమైన సాంకేతిక నైపుణ్యంతో హారర్ చిత్రాలను అందించిన జానపద బ్రహ్మ, దర్శకుడ బీ విఠలాచార్య గురించి తెలియని వారుండరు. ఆ సమయంలోనే హాలీవుడ్ చిత్రాలకు ధీటుగా స్థానిక సాంకేతిక నైపుణ్యంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే ప్రయత్నం చేశారు. అలాంటి గొప్ప దర్శకుడు బీ విఠలాచార్య గురించి.. ఆయన జీవితంలో తెలియని విషయాలకు ప్రముఖ జర్నలిస్టు, సినీ రచయిత పులగం చిన్నారాయణ అక్షర రూపం కల్పించి అందించిన పుస్తకం జై విఠలాచార్య.

ఈ పుస్తకానికి మూవీ వాల్యూమ్ మీడియా అధినేత షేక్ జిలాన్ బాషా ప్రచురణ కర్తగా వ్యవహరించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదుగా జరిగింది. తొలి పుస్తకాన్ని రైల్వే ఉన్నతాధికారి, సినీ అభిమాని, మ్యూజిక్ కలెక్టర్ రవి పాడికి త్రివిక్రమ్ అందించారు. పుస్తకావిష్కరణ సందర్భంగా..

B Vitalacharyas Jai Vitalacharya book unveiled by Trivikram Srinivas

జానపద బ్రహ్మ బీ విఠలాచర్య నిర్మించిన, దర్శకత్వం వహించిన సినిమాలు చూడని ప్రేక్షకులు ఉండరు. తరాలు మారినా ఆయన సినిమాలకు ఆదరణ తగ్గదలేదంటే.. అంత గొప్ప సినిమాలను అందించారు.

రచయిత, జర్నలిస్టు పులగం చిన్నారాయణ నాకు బాగా పరిచయం. ఆయన రాసిన ఇంతకు ముందు పుస్తకాలు కూడా నేను చదివా. ఇప్పుడు విఠలాచార్య గారిపై పుస్తకం రాశారు. విఠలాచార్య అంటే ఫాదర్ ఆఫ్ తెలుగు మాస్ సినిమా, ఫాదర్ ఆఫ్ జానపదాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న వీఎఫ్ఎక్స్ ఫిల్మ్స్ వంటి వాటికి అన్నిటి కంటే ముందు... తెలుగు సినిమా మొదలైన రోజుల్లో చాలా అడ్వెంచరస్ గా సినిమా తీసిన గొప్ప సాంకేతిక నిపుణుడిగా ఆయనను చూస్తాను. ఆయన సక్సెస్ రేషియో గానీ, ఆయన తాలూకూ రీచ్ గానీ, ఆయన పాపులారిటీ గానీ ఇప్పుడున్న తరానికి, ప్రస్తుతం చాలా మందికి తెలియదు. యూట్యూబ్ లేదా పాత సినిమాలు ప్రసారం చేసే ఛానళ్లలో చూడటం తప్ప ఆయన గురించి ఎక్కువ మందికి తెలియదు. ఆయన జీవితం, ప్రస్థానాన్ని జనం ముందుకు తీసుకు రావాలనే ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని అన్నారు.

పులగం చిన్నారాయణ గారికి, రవి గారికి, పబ్లిషర్ జిలానీ గారికి కంగ్రాచ్యులేషన్స్. ఇటువంటి పుస్తకాలు తీసుకు రావడం లాభసాటి వ్యాపారం కాదు. సినిమాపై వాళ్ళకు ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తోంది. పుస్తకాలు అంటే అభిమానించే వ్యక్తిగా ఇటువంటి ప్రయత్నాలు బావుండాలని, ప్రజల్లో పుస్తక పఠనం బాగా పెరగాలని కోరుకుంటున్నా. చరిత్రను రికార్డ్ చేయడం అనేది తెలుగులో తక్కువ. తెలుగు సినిమా చరిత్ర చాలా తక్కువగా అందుబాటులో ఉంది. పులగం చిన్నారాయణ గారు ఇంకా ఇంకా ఎక్కువ పుస్తకాలు రాయాలి. ఆయనకు ఆ శక్తి, ఆసక్తి... రెండూ ఉన్నాయి కాబట్టి పుస్తకాలు ఇలాగే రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని త్రివిక్రమ్ చెప్పారు.

B Vitalacharyas Jai Vitalacharya book unveiled by Trivikram Srinivas

జై విఠలాచార్య పుస్తకాన్ని ఆవిష్కరించిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు రచయిత పులగం చిన్నారాయణ ధన్యవాదాలు తెలియజేవారు. దిగ్గజ దర్శకుడు విఠలాచార్య సినిమాలు తీసినంత వేగంగా జై విఠలాచార్య సినిమాలు తీశాను. సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్య నారాయణ, జమున, వాణిశ్రీ, రాజశ్రీ, జయమాలిని, నరసింహరాజు లాంటి సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాను. విఠలాచార్య ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడి కొన్ని విషయాలు సేకరించారు. విఠలాచార్య గారు దర్శకత్వం వహించిన 39 సినిమాల తెరవెనుక విశేషాలు, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, ఇప్పటి వరకు ఎక్కడ లేని సమాచారంతో పుస్తకంలో పొందుపరిచాను. సాహిత్యంపై మక్కువ అభిరుచి ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతులు మీదుగా పుస్తకావిష్కరణ జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది అని పులగం చిన్నారాయణ అన్నారు.

జై విఠలాచార్య పుస్తకావిష్కరణలో పాల్గొన్న రైల్వే ఉన్నతాధికారి రవి పాడి మాట్లాడుతూ.. సీనియర్ పబ్లిసిటీ డిజైనర్, రఘుపతి వెంకయ్య పురస్కార గ్రహీత ఈశ్వర్ ఆఖరి పెయింటింగ్‌తో జై విఠలాచార్య పుస్తకం కవర్ పేజీ రూపొందింది. త్రివిక్రమ్ చేతుల మీదుగా ఈ పుస్తకం తొలి ప్రతిని అందుకోవడం సంతోషంగా ఉంది. పులగం చిన్నారాయణ గారు ఎంతో పరిశోధన చేసి... ఎంతో మందిని కలిసి విఠలాచార్య గారిపై పుస్తకం తీసుకు వచ్చారు. తెలుగు సినిమా చరిత్రను అక్షరబద్ధం చేస్తున్న ఆయన మరిన్ని పుస్తకాలు తీసుకు రావాలని కోరుకుంటున్నా'' అని చెప్పారు.

షేక్ జీలాన్ బాషా మాట్లాడుతూ ''జర్నలిజంలో ఉన్న నేను ఈ పుస్తకంతో పబ్లిషర్ గా అడుగు పెడుతున్నందుకు గర్వంగా ఉంది. సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ పుస్తకం కవర్ పేజీ ఆవిష్కరించారు. అదొక మరపురాని అనుభూతి. ఇప్పుడు పుస్తకాన్ని ఆవిష్కరించిన త్రివిక్రమ్ గారికి థాంక్స్'' అని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X