పవన్ మెసేజ్ పెట్టారంటూ వివరణ
హైదరాబాద్ : " బాబాయ్ పవన్ ఇక్కడకు రాలేదు కానీ ఆయన బ్లెస్సింగ్స్ నాతోనే ఉన్నాయి. ఆయన గోపాల గోపాల షూటింగ్ లో వారణాసిలో బిజీగా ఉన్నారు. ఏదైమైనా నాకు ఆయన మెసేజ్ పంపి, శుభాకాంక్షలు తెలిపారు..."అన్నారు వరుణ్ తేజ. వరుణ్ తేజ హీరోగా లాంచ్ అవుతున్న చిత్రం ముకుందా ఈ చిత్రం ఆడియో పంక్షన్ నిన్న రాత్రి జరిగింది. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ వస్తాడని అందరూ భావించారు. అయితే ఆయన రాలేదు. ఈ విషయమై వివరణ ఇస్తూ వరుణ్ తేజ ఇలా స్పందించారు.
షూటింగ్ మొత్తం పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వరుణ్‌తేజ్ ఇటీవలే తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసాడు. ముకుందా' ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు. ఇటీవలే విడుదల చేసిన వరుణ్‌తేజ్ ఫస్ట్‌లుక్ మరియు ఫస్ట్‌లుక్ టీజర్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్‌తేజ్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు. లియో ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఠాగూర్ మధు సమర్పకుడు.

దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ... యాక్షన్ అంశాల మేళవింపుతో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రమిది. పల్లెటూరి అనుబంధాలు, ప్రేమలు, రాజకీయాలు యువతరంపై ఏ విధమైన ప్రభావాన్ని చూపుతున్నాయనే అంశాన్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాం. ఎలాంటి అంశాలకు ప్రభావితం కాని ఓ కుర్రాడి జీవితం ప్రేమ కారణంగా ఎన్ని మలుపులు తిరిగింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది.
ఇదివరకు నేను తెరకెక్కించిన చిత్రాలకి భిన్నంగా యాక్షన్‌కి ప్రాధాన్యమిస్తూ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నా. ప్రతీ సన్నివేశం సహజంగా కనిపించాలని భీమవరం, అమలాపురం, తాడేపల్లిగూడెం, ద్రాక్షారామం, సామర్లకోట తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. యువతరం భావోద్వేగాల్ని ప్రతిబింబిస్తూ సాగే ఈ చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది. వరుణ్‌తేజ్ నటన, పూజా హెగ్డే గ్లామర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ''ఒక చిన్న పట్టణం నేపథ్యంలో సాగే కథ ఇది. ముకుంద అనే ఓ యువకుడి ప్రేమపై స్థానిక పరిస్థితులు ఎలాంటి ప్రభావం చూపించాయి? వాటి నుంచి బయట పడేందుకు అతను ఏం చేశాడు? అనే విషయాలు ఆసక్తికరం. వరుణ్‌తేజ్ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.'' అన్నారు. మిగిలిన ఓ పాటని హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సెట్ వేసి తెరకెక్కిస్తామన్నారు నిర్మాతలు.


Click it and Unblock the Notifications











