‘బాద్ షా’ 3 డేస్ కలెక్షన్ ఎంత?

సినిమాకు ఆడియన్స్ తాకిడి ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం ఆ సినిమా ప్రదర్శితం అవుతున్న థియేటర్లలో చాలా వరకు మూడు వారాల పాటు కంటిన్యూ చేయాలని నిర్ణయించారు. దీంతో ఉగాదికి విడుదల కావాల్సి ఉన్న గ్రీకు వీరుడు, షాడో లాంటి చిత్రాల విడుదల వాయిదా పడింది.
అమెరికాలో బాద్ షా చిత్రం కలెక్షన్లు 4 రోజుల లోపు 1 మిలియన్ మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఏపీలో 'బాద్ షా' చిత్రానికి తొలి మూడు రోజుల్లో రూ. 16.05 కోట్ల షేర్ దక్కినట్లు సమాచారం అందుతోంది. అయితే ఇది అఫీషియల్‌గా ఖరారు కావాల్సి ఉంది.
జూనియర్ ఎన్టీఆర్, కాజల్ జంటగా నటించిన ఈచిత్రం విడుదలై అన్ని చోట్లా తొలి రోజు 100% ఆక్యుపెన్సీ సాధించాయి. సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్ మొదలు కావడంతో తొలి వీకెండ్ (శుక్ర, శని, ఆది) టికెట్లన్నీ ముందుగానే బుక్ అయ్యాయి. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బేనర్ పై నిర్మించారు. తమన్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











