twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాద్ షా’ 50 డేస్ 60 సెంటర్స్(లిస్ట్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన 'బాద్ షా' చిత్ర ప్రదర్శన 50 రోజులు పూర్తి చేసుకుంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రం ఏప్రిల్ 4న విడుదలై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 60 సెంటర్లలో ఈ చిత్రం అర్థ శత దినోత్సవం పూర్తి చేసుకుంది.

    ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటించింది. ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందించారు. ఎన్టీఆర్ తొలిసారిగా ఈ చిత్రంలో వివిధ రకాల డిఫరెంట్ గెటప్స్‌తో ఆకట్టుకున్నాడు. తమన్ అందించిన సంగీతానికి కూడా శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన తొలి వారంలో మంచి ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.

    సినిమా ప్రదర్శన 50 రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ...నిర్మాతకు అనుకున్న లాభాలు రాక పోతగా, కాస్త నష్టం వాటిల్లిందనే వార్తలు కూడా ఇటీవల వెలువడ్డాయి. అందులో నిజం ఎంతో తెలియదు కానీ, వరుస ప్లాపులతో సతమతమైన జూ ఎన్టీఆర్ 'బాద్ షా' హిట్ టాక్‌తో కాస్త రీచార్జ్ అయ్యాడనే చెప్పాలి.

    బాద్ షా సెంటర్స్ లిస్ట్

    నైజాం : 9 సెంటర్లు
    విశాఖ : 4 సెంటర్లు
    ఈస్ట్ గోదావరి : 4 సెంటర్లు
    వెస్ట్ గోదావరి : 2 సెంటర్లు
    కృష్ణ : 3 సెంటర్లు
    గుంటూరు : 6 సెంటర్లు
    నెల్లూరు : 4 సెంటర్లు
    చిత్తూరు : 7 సెంటర్లు
    కడప : 8 సెంటర్లు
    అనంతపురం : 5 సెంటర్లు
    కర్నూలు: 7 సెంటర్లు
    బళ్లారి(కర్నాటక) : 1 సెంటర్

    English summary
    
 Young tiger Jr NTR and Kajal Agarwal starrer Baadshah has successfully completed its 50 days of run in 60 centers in India.Here is the movie 50 days centers list with Theater names.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X