ఎన్టీఆర్ ‘బాద్‌షా’ విడుదలపై బండ్ల గణేష్ ట్వీట్
హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తర్వాతి సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్-శ్రీను వైట్ల కాంబినేషన్లో సినిమా సంక్రాంతికి వస్తుందని ఆశించినప్పటికీ.....షూటింగ్ పూర్తి కాక పోవడంతో ఈ 'బాద్ షా' సంక్రాంతి బరి నుంచి తప్పకుంది.
దర్శకుడు శ్రీను వైట్ల ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తూ... మేజర్ పార్ట్ కంప్లీట్ చేసాడు. పాటల చిత్రీకరణ, మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. తాజాగా నిర్మాత బండ్ల గణేష్ సినిమా విడుదలపై తన ట్విట్టర్ ద్వారా ప్రకటన చేసాడు. మార్చి మొదటి వారంలో ఆడియో విడుదల చేస్తామని, అదే నెల చివరి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తామని వెల్లడించారు.

ఇతర విశేషాల్లోకి వెళితే....
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమా మరో దూకుడు అవుతుందని, ఆ రేంజిని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











