twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరోల గుండెల్లో టెర్రర్.... ఇక ఆ ఆర్భాటాల్లేనట్లేనా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: స్టార్ హీరోల సినిమాలు మొదలైనప్పటి నుంచి విడుదలయ్యే వరకు, ఆ తర్వాత 50 రోజులు వేడుక, 100 రోజుల వేడుక ఇలా రకరకాల కార్యక్రమాలు నిర్వహించడం ఎప్పటి నుండో ఆనవాయితీగా వస్తోంది. ఇక ఆడియో వేడుకలు లాంటి కార్యక్రమాలైతే వేల సంఖ్యలో అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా జరుపుకోవడం ఇప్పుడో ట్రెండుగా మారిపోయింది. హీరో రేంజిని బట్టి నిర్మాతలు ఇలాంటి కార్యక్రమాలకు భారీ వేదికలను ఏర్పాటు చేయడం, వినోదకార్యక్రమాలు నిర్వహించడం చూస్తూనే ఉన్నాం.

    ఇలాంటి కార్యక్రమాలకు అభిమానులు భారీ సంఖ్యలో తరలి వస్తుండటంతో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్యలు చక్కబెట్టడం పోలీసులకు తలకు మించిన భారం అయ్యేది. ఇటీవల దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల నేపథ్యంలో ఇకపై సినిమా వాళ్లు ఏర్పాటు చేసే భారీ వేడుకలకు పోలీసులు అనుమతి ఇచ్చేందుకు అంగీకరించడం లేదు.

    ఇంటలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు తరచూ నగరంలో సోదాలు, భద్రతా ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలో సినిమాళ్లు ఏర్పాటు చేసే ఆడియో వేడుకల్లాంటి భారీ ఈవెంట్లకు భద్రతా ఏర్పాట్లు కల్పించడం తమ వల్ల కాదని చేతులెత్తేస్తున్నట్లు తెలుస్తోంది.

    మరో వైపు కొందరు హీరోలు కూడా ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు సుముఖత చూపడం లేదు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ 'బాద్ షా' ఆడియో వేడుక వాయిదా పడటం వెనక ఉగ్రవాదుల దాడి భయం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. నగరంలో పరిస్థితి చక్కబడే వరకు..... భారీగా అభిమానుల సమూహంతో కూడిన స్టార్ హీరోల సినిమాల ఆడియో వేడుకలు, ఇతరత్రా సినిమా వేడుకలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఒక వేళ జరిగినా తక్కువ సంఖ్యలో జన సమూహం మధ్య మాత్రమే నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.

    English summary
    The recent serial bomb blasts in the Hyderabad city has left the state shocked. When the city is still struggling to recover from this tragedy, the Intelligence Bureau smells possible attacks over the next few days and it has notified the same to the State Government, which has already locked down commercial areas like Ameerpet, Begum Bazaar, Koti and declared the Red Alert in the state capital. The eagerly-awaited audio launch function of Telugu movie Baadshah starring Junior NTR and Kajal Aggarwal in leads, has been delayed by a week due to the terrorists' threat. The music was scheduled to be released on March 10 as Shivarathri treat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X