ఎన్టీఆర్ ‘బాద్ షా’ ఆడియోకు తొలగిన అడ్డంకి
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల నేపథ్యంలో సెక్యూరిటీ కారణాల వల్ల ఈ నెల 10న జరుగాల్సిన జూ ఎన్టీఆర్ తాజా మూవీ 'బాద్ షా' ఆడియో వేడుక వాయిదా పడిన విషయం తెలిసింతే. తాజాగా ఆడియో వేడుక తేదీ ఖరారు చేసారు. ఈ నెల 17న నానక్‌రాంగూడ రామానాయుడు స్టూడియోలో వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
శివరాత్రి సందర్భంగా ఈ నెల 10న రామానాయుడు స్టూడియోలోనే ఆడియో వేడుక నిర్వహించాలని ముందుగా అనుకున్నారు. అయితే ఉగ్రవాదులు శివరాత్రి రోజున పలు దేవాలయాలను టార్గెట్ చేసుకుని విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ రావడం....ఆ రోజు 'బాద్ షా' ఆడియో వేడుకకు సెక్యూరిటీ సమస్య కారణాలను చూపి అనుమతి నిరాకరించారు పోలీసులు.
తాజాగా పోలీసులు అనుమతితోనే ఈ నెల 17న అదే లొకేసన్లో బాద్ షా ఆడియో వేడుక నిర్వహించాలని నిర్ణయించారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఈ ఆడియో వేడుకజరుగనుంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ బేనర్‌పై బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూ ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఆడియో ట్రాక్ లిస్ట్
1. సైరో సైరో...
2. బంతిపూల జానకి..
3. చలాకి పిల్లమ్మో...
4. డైమండ్ గర్ల్..
5. వెల్‌కం కనకం..
6. బాద్ షా టైటిల్ సాంగ్
దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











