ఆదిత్య మ్యూజిక్ ద్వారా బాద్‍షా పాటలు
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, కాజల్ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై బండ్ల గణేష్ నిర్మిస్తున్న 'బాద్‍షా' సినిమా ఆడియో రైట్స్ ని ఆదిత్య మ్యూజిక్ కైవసం చేసుకుంది. ఈ చిత్రానికి ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సందర్బంగా ఆదిత్య మ్యూజిక్ మేనేజింగ్ డైరెక్టర్ ఉమేష్ గుప్తా మాట్లాడుతూ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై గతంలో వచ్చిన ఆంజనేయులు, తీన్‍మార్ మరియు గబ్బర్ సింగ్ చిత్రాల పాటలు మా ఆదిత్య మ్యూజిక్ ద్వారానే విడుదలై విజయవంతం అయ్యాయని తెలిపారు.
ఇప్పుడు వస్తున్న బాద్‍షా సినిమా పాటలు కూడా మా ఆదిత్య మ్యూజిక్ సంస్థ ద్వారా విడుదల అవుతున్నందుకు సంతోషంగా ఉంది. నిర్మాత బండ్ల గణేష్ బాద్‍షా పాటల రైట్స్‌ని ఆదిత్య మ్యూజిక్ సంస్థకు ఇచ్చినందుకు థాంక్స్. తమన్ అందించిన ఆరు పాటలు చాలా బాగున్నాయి. ఈ నెల 10న నానక్ రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో ఆడియో విడుదల కార్యక్రమం జరుగుతుంది. ఎన్టీఆర్ అభిమానులకు తప్పకుండా బాద్‍షా పాటలు నచ్చుతాయి' అన్నారు.
ట్రాక్ లిస్టు వివరాలు:
1. సైరో సైరో...
2. బంతిపూల జానకి..
3. చలాకి పిల్లమ్మో...
4. డైమండ్ గర్ల్..
5. వెల్‌కం కనకం..
6. బాద్ షా టైటిల్ సాంగ్
దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











