‘బాద్ షా’ బెన్‌ఫిట్ షో డీటేల్స్, ఉదయం గం. 5.09 రిలీజ్!
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'బాద్ షా' మూవీ విడుదలకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 5న ఈచిత్రం గ్రాండ్ గా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు అభిమానుల కోసం ప్రదర్శించే బెన్ ఫిట్ షోకు సంబంధించిన ఏర్పాట్లు కూడా శర వేగంగా జరుగుతున్నాయి.
హైదరాబాద్ నగరంలో కూకట్‌పల్లిలోని విశ్వనాథ్ థియేటర్లో ఏప్రిల్ 5వ తేదీ ఉదయం 7 గంటలకు బెన్‌ఫిట్ షో ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఒక్కో టిక్కెట్ ధర రూ. 300 నుంచి రూ. 1000 వరకు పలుకుతున్నట్లు తెలుస్తోంది.
కాగా... 'బాద్ షా' చిత్రం ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసారు. ఈ సినిమా గురించి బండ్ల గణేష్ మాట్లాడుతూ ఈ సమ్మర్లో 'బాద్ షా' బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, ఏప్రిల్ 5వ తేదీ ఉదయం 5.09 గంటలకు సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం అన్నారు.
ఎన్టీఆర్, కాజల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో 50 మంది ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్, కె.వి.గుహన్, గోపీమోహన్, కోనవెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, ఎంఆర్ వర్మ, చలసాని రామారావు సాంకేతిక వర్గం. సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











