‘బాద్‌షా’ సెన్సార్... ఫూల్స్ అవుతారా?
హైదరాబాద్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'బాద్ షా' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు శుక్రవారమే పూర్తవ్వాల్సి ఉండగా.... అనుకోని కారణాలతో వాయిదా పడింది. తాజాగా ఈ చిత్ర సెన్సార్ ఫూల్స్ డే (ఏప్రిల్ 1)న పూర్తి కానుంది. మరి ఈ రోజైనా పని పూర్తవుతుందో? తూచ్ అంటూ సెన్సార్ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్న అభిమానులను ఫూల్స్ చేస్తారో?
కాగా... ఏప్రిల్ 5న సినిమాను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే భారీగా థియేటర్లు కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రికార్డు స్థాయి కలెక్షన్స్ సాధించడమే లక్ష్యంగా నిర్మాతలు విడుదల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న 'బాద్ షా' చిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు.
నవదీప్ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్ లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్ ఎస్.ఎస్, మాటలు: కోనా వెంకట్, గోపీమోహన్, కెమెరా: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనువైట్ల.


Click it and Unblock the Notifications











