ఎన్టీఆర్ 'బాద్‌షా' సెన్సార్ తేదీ
హైదరాబాద్ : ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం 'బాద్‌షా'. కాజల్ హీరోయిన్ . శ్రీనువైట్ల దర్శకుడు. వచ్చే నెల 5న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాత బండ్ల గణేష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ చిత్రం మార్చి 29న సెన్సార్ జరగనుంది. ఇప్పటికే ఈ చిత్రం టీజర్ ద్వారా విడుదలైన డైలాగులు ఫ్యాన్స్ ను బాగా అలరిస్తున్నాయి.
''ఎన్టీఆర్‌లోని నటుణ్ని కొత్త తరహాలో చూడొచ్చు. ఆయన గెటప్, పలికే సంభాషణలు అందర్నీ అలరిస్తాయి. ఈ చిత్రానికి మహేష్‌బాబు వాయిస్ ఓవర్ చెప్పడం ఆనందంగా ఉంది. ఇటీవల విడుదలైన పాటలకు చక్కటి స్పందన వస్తోంది. తమన్ స్వరాలు ఎన్టీఆర్ అభిమానులకు బాగా నచ్చాయి. ఈ నెలాఖరున ప్లాటినం డిస్క్ కార్యక్రమం నిర్వహిస్తాము''అన్నారు
ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం 'బాద్ షా'. ఈ చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేయటానికి నిర్మాత బండ్ల గణేష్ నిర్ణయించారు. ఆయన తన ట్విట్టర్ లో ఈ విషయమై స్పందించారు. ఆయన ట్వీట్ చేస్తూ... "నేను బాద్షా చిత్రం సక్సెస్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఈ సినిమాను మా బ్రదర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో హిందీలో రీమేక్ చేస్తాను!!," అన్నారు.
ఇక ఈ చిత్రంలో విలన్ గా నెగిటివ్ పాత్రలో యంగ్ హీరో నవదీప్ కనిపించనున్నారు. ఈ పాత్ర సినిమాలో ఊహించని విధంగా సాగి నవ్వులు పండిస్తూ కీలకమై నిలుస్తుంది అంటున్నారు. అలాగే కెరిర్ చివరి దశలో ఉన్న నవదీప్ కు ఈ పాత్ర బూస్ట్ ఇస్తుంది. అతనికి ఈ సినిమా చాలా మైలైజి ఇచ్చి వరస ఆఫర్స్ తెచ్చి పెట్టే విధంగా సాగుతుందని చెప్పుకుంటున్నారు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పాత్ర కూడా డిఫెరెంట్ గా ఉంటుంది. ఆ పాత్ర గురించి చెబుతూ నిర్మాత బండ్ల గణేష్... సేవకుడిగా కాదు.... పాలకుడిగా బతకడమే అతనికిష్టం. బుల్లెట్‌లా కాదు, దాని లక్ష్యాన్ని శాసించే ట్రిగ్గర్‌లా ఉండడమే అతనికిష్టం. అందుకే తనకు తానే 'బాద్ షా' అని ప్రకటించుకొన్నాడు. ఇంతకీ ఎవరతను? అతని లక్ష్యమేమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు బండ్ల గణేష్.


Click it and Unblock the Notifications











