‘బాద్ షా’ సెన్సార్ డీటేల్స్, పని ముగించిన మహేష్
హైదరాబాద్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'బాద్ షా' చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందిస్తున్న మహేష్ బాబు ఇటీవలే ఆ పని పూర్తి చేసారు. మార్చి 29 వరకు పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని అదే రోజున ఈ చిత్రం సెన్సార్‌కు వెళ్ల నుందని తెలుస్తోంది.
ఏప్రిల్ నెలలో విద్యా సంస్థలకు హాలీడేస్ మొదలవ్వనున్న నేపథ్యంలో ఏప్రిల్ 5న సినిమాను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే భారీగా థియేటర్లు కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రికార్డు స్థాయి కలెక్షన్స్ సాధించడమే లక్ష్యంగా నిర్మాతలు విడుదల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న 'బాద్ షా' చిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు.
నవదీప్ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్ లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్ ఎస్.ఎస్, మాటలు: కోనా వెంకట్, గోపీమోహన్, కెమెరా: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనువైట్ల.


Click it and Unblock the Notifications











