‘బాద్‌షా’ ఎఫెక్ట్: ట్విట్టర్లో చేరిన శ్రీనువైట్ల

By Bojja Kumar

హైదరాబాద్: టాలీవుడ్లో చాలా మంది సెలబ్రిటీలు ట్విట్టర్ అకౌంట్ మెయింటేన్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమ సినిమాల ప్రమోషన్‌‌తో పాటు, తమ పబ్లిసిటీ పెంచుకోవడానికి ఇలాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ఎంతగానే ఉపయోగపడతాయనే విషయం గ్రహించిన వారంతా ఎప్పుడో అకౌంట్స్ ఓపెన్ చేసారు.

అయితే టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరైన శ్రీను వైట్ల మాత్రం ఇప్పటి వరకు ట్విట్టర్లో చేరలేదు. అయితే ఆయన భార్య రూప వైట్ల మాత్రం ఎప్పుడో ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి అందరితో టచ్ లో ఉంటోంది. దర్శకుడిగా తనకు ట్విట్టర్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్ల అవసరం ఎంతో ఉందని చాలా ఆలస్యంగా గ్రహించిన శ్రీను వైట్ల 'బాద్ షా' సినిమా విడుదల సందర్భంగా ఈ రోజు ట్విట్టర్లో ఖాతా తెరిచారు.

గురువారం ఆయన ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయగా అప్పుడే ఆయన్ను ఫాలో అయ్యేవారి సంఖ్య 3,200 చేరుకోవడంతో పాటు..... శర వేగంగా ఆ సంఖ్య పెరుగుతూ వెలుతోంది. "What better occasion to join Twitter than the release of 'Baadshah'. Thank you all for the warm welcome." అంటూ శ్రీను వైట్ల తొలి ట్వీట్ చేసారు.

ఈ రోజు విడుదలైన 'బాద్ షా' చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోవడంతో పాటు హిట్ టాక్ రావడంతో...సినిమాను విజయ వంతం చేసిన ప్రేక్షకులకు, సక్సెస్ లో భాగస్వాములైన యూనిట్ సభ్యులకు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా థాంక్స్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X