బ్యాంకాక్ కు బయలుదేరుతున్న జూ.ఎన్టీఆర్
హైదరాబాద్ : ఇటలీ షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసుకువచ్చిన జూ.ఎన్టీఆర్ బ్యాంకాక్ కి ప్రయాణం పెట్టుకున్నారు. ఆగస్టు 11 నుంచి అక్కడ బాద్షా షూటింగ్ జరగనుంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో జరిగే ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ డిఫెరెంట్ గెటప్ లో కనిపించనున్నారు. దూకుడు జోరు మీద ఉన్న శ్రీను వైట్ల ఈ చిత్రాన్ని పూర్తి స్ధాయి ఎంటర్టైనర్ గా శ్రీను వైట్ల రూపొందిస్తున్నారు.
ఈ చిత్రం విశేషాలను నిర్మాత బండ్ల గణేష్‌బాబు తెలియజేస్తూ' యాక్షన్‌తో అంశాలతో పాటు ఓ అందమైన ప్రేమకథ కూడా ఈ చిత్రంలో వుంది. ఈ చిత్రంలో శ్రీనువైట్ల కొత్త ఎన్టీఆర్‌ను చూపించబోతున్నాడు. ఆయన ఇమేజ్, శారీరక భాషకు సరిగ్గా సరిపోయే కథ. ఎన్టీఆర్ నుంచి ఆయన అభిమానులు ఆశిస్తున్న అంశాలు ఇందులో పుష్కలంగా వున్నాయి. ఇంతకు ముందు 'అదుర్స్' చిత్రంలో తన కామెడీ టైమింగ్‌తో అందర్ని నవ్వించిన ఎన్టీఆర్ ఈ చిత్రంలో ప్రేక్షకులను మరింతగా అలరించనున్నాడు. ఇప్పటి వరకు చేయని ఓ విభిన్నమైన పాత్రను ఆయన ఇందులో చేస్తున్నాడు. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ మెప్పు పొందుతుందనే విశ్వాసం వుంది' అన్నారు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి చెబుతూ నిర్మాత బండ్ల గణేష్...సేవకుడిగా కాదు.... పాలకుడిగా బతకడమే అతనికిష్టం. బుల్లెట్‌లా కాదు, దాని లక్ష్యాన్ని శాసించే ట్రిగ్గర్‌లా ఉండడమే అతనికిష్టం. అందుకే తనకు తానే 'బాద్‌షా' అని ప్రకటించుకొన్నాడు. ఇంతకీ ఎవరతను? అతని లక్ష్యమేమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు బండ్ల గణేష్.అలాగే కాజల్ హీరోయిన్ గా చేస్తోంది. అలాగే ఎన్టీఆర్ సినిమాల నుంచి యాక్షన్‌నీ, శ్రీను వైట్ల సినిమాల నుంచి వినోదాన్నీ ఆశిస్తారు. ఇవి రెండూ కలగలిపిన సినిమా ఇది. ఎక్కువ భాగం విదేశాల్లోనే చిత్రీకరిస్తాము''అన్నారు.
ఎన్టీఆర్ సైతం ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...సినిమా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అన్నారు. శ్రీను వైట్ల,ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే జనం రకరకాలు అంచనాలు వేస్తున్నారు. వాటినన్నిటికీ అతీతంగా కథ,కథనం ఉంటాయి. పూర్తిగ మొదటినుంచి చివరి వరకూ పొట్ట పగిలేలా నవ్విస్తాము అన్నారు. ఇక ఈ విషయమై స్క్రిప్టు రైటర్ కోన వెంకట్ తన ట్విట్టర్ పేజీలో...ఈ సినిమాలో ఎన్టీఆర్ బ్రాండ్ న్యూ అవతార్ లో కనిపించనున్నాడు. ఎన్టీఆర్ అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే ఉంటారు అన్నారు.


Click it and Unblock the Notifications











