'బాద్‌షా' ఆడియో విడుదల తేదీ ప్రకటన
హైదరాబాద్ : ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొంద బోతున్న యాక్షన్ అండ్ కామెడీ మూవీ 'బాద్ షా' షూటింగ్ దాదాపు ముగింపు దసకు వచ్చింది. మార్చ్‌లో లాంచ్ చేయబడ్డ ఈ చిత్రం శ్రీను వైట్ల దర్శకత్వంలో శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియోని మార్చి 10న విడుదల చేయనున్నట్లు నిర్మాత ఖరారు.
బండ్ల గణేష్ మాట్లాడుతూ... ''మార్చి 10న ఈ చిత్రంలోని గీతాల్ని విడుదల చేస్తాం. అభిమానుల నడుమ సందడిగా గీతావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఏప్రిల్ 5న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు. తమన్ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రంలో నవదీప్ కీ రోల్ చేసారు.
అలాగే.. ఎన్టీఆర్ సినిమా అంటే మాస్, యాక్షన్‌ల కలబోత. వీటితోపాటు వినోదం కూడా తోడై వస్తే అది శ్రీను వైట్ల శైలి. ఇప్పుడు వీరిద్దరి కలయికలో వస్తున్న 'బాద్‌షా'లో ఇవన్నీ మేళవించామంటున్నారు బండ్ల గణేష్. ఆయన నిర్మిస్తున్న చిత్రం 'బాద్‌షా'. కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో పాటలు షూటింగ్ జరుగుతోంది.
''ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉంటూనే నా స్టైల్‌లో పూర్తి వినోదభరితంగా సినిమా ఉంటుంది. ఇందులో ఎన్టీఆర్ పాత్ర చిత్రణ, ఆయన లుక్ కొత్తగా ఉంటుంది. నందమూరి అభిమానులు పండుగ చేసుకునే సినిమా అవుతుంది'' అని శ్రీనువైట్ల చెప్పారు. తెలుగు చిత్రపరిశ్రమలోనే భారీ బడ్జెట్ చిత్రం ఇది. ఎన్టీఆర్, కాజల్‌లతో పాటు తెలుగు, తమిళ, హిందీ రంగాలకు చెందిన 50మందికి పైగా ప్రముఖ నటీనటులు ఇందులో నటిస్తున్నారు . ఆసక్తిగొలిపే కథ, కథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులోని యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ ప్రేక్షకుల్ని అద్భుతంగా ఎంటర్‌టైన్ చేస్తాయి. 'బాద్‌షా'గా ఓ కొత్త ఎన్టీఆర్‌ని చూస్తారు.


Click it and Unblock the Notifications











