‘బాద్ షా’కు గుమ్మడికాయ కొట్టేదెప్పుడంటే...?
హైదరాబాద్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందుతున్న 'బాద్ షా' చిత్రానికి ఈ నెల 15న గుమ్మడికాయ కొట్టబోతున్నారు. గుమ్మడికాయ కొట్టడం అంటే సినిమా షూటింగ్ పూర్తయిందని అర్థం. సో... మార్చి 15తో 'బాద్‌షా' చిత్రం షూటింగ్ మొత్తం కంప్లీట్ కాబోతోందన్నమాట.
మరో వైపు ఇప్పటికే ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. డబ్బింగ్, రీరీకార్డింగ్, విజువల్ ఎఫెక్ట్స్, డిటీఎస్ మిక్సింగ్ తదితర పనులు చకచకా జరిగిపోతునప్నాయి. మరో వైపు ఈ నెల 17న 'బాద్ షా' ఆడియో వేడుక గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న 'బాద్ షా' చిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు.
ఈ చిత్రం టీజర్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ... టెక్నికల్ సమస్యల వల్ల టీజర్ విడుదల చేయలేక పోయామని, త్వరలోనే టీజర్ విడుదల తేదీ ప్రకటిస్తామని ఆ చిత్ర రచయితల్లో ఒకరైన గోపీమోహన్ వివరణ ఇచ్చారు. ఏ విధంగా చూసినా బాద్ షా స్పెషల్ గా ఉంటుంది. ప్రేక్షకులను ఈచిత్రం గ్రాండ్ గా ఎంటర్ టైన్ చేస్తుందనే భరోసా ఇస్తున్నారు గోపీమోహన్.


Click it and Unblock the Notifications











