twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ ఖాతాలో హిట్, ఫ్యాన్స్ సంబరాలు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : హిట్ కోసం దాదాపు రెండున్నరేళ్లుగా ఎదురు చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్, ఆయన అభిమానుల దాహం తీరింది. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన 'బాద్ షా' చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. శ్రీను వైట్ల మార్కు రొటీన్ సినిమాలా ఉన్నప్పటికీ 100శాతం ఎంటర్టెన్మెంట్, హిట్ అని టాక్ బయటకు రావడంతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

    2010లో వచ్చిన 'బృందావనం' సినిమా తర్వాత జూనియర్ హిట్ మొహం ఎరుగలేదు. బృందావనం తర్వాత వచ్చిన శక్తి బాక్సాఫీసు వద్ద భారీ అపజయాన్ని చవిచూడగా, ఊసరవెల్లి చిత్రం కూడా హిట్ రేంజిని అందుకోలేక పోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన 'దమ్ము' చిత్రం అంచనాలను తారుమారు చేస్తూ బోల్తా పడింది.

    ఇలా వరుస అపజయాలతో కసిగా ఉన్న జూ ఎన్టీఆర్...హిట్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్లతో జతకట్టి హిట్ కొట్టాలనే కసి 'బాద్ షా' చిత్రంతో తీర్చుకున్నాడనే చెప్పాలి. ఈచిత్రం కోసం తాను గతంలో ఎన్నడూ లేని విధంగా కష్ట పడ్డానని, కాస్టూమ్స్, హెయిర్ స్టైల్ ఇలా ప్రతి అంశంలోనూ సినిమా ప్రత్యేకంగా ఉంటుందని జూనియర్ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిదే.

    'బాద్ షా' చిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటించగా, తమన్ సంగీతం అందించారు. దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీలోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందించారు. ఈ చిత్రానికి థమన్, కె.వి.గుహన్, గోపీమోహన్, కోనవెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, ఎంఆర్ వర్మ, చలసాని రామారావు సాంకేతిక వర్గం. సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    
 Director Srinu Vaitla latest directorial venture Baadshah starring Junior NTR and Kajal Aggarwal in leads, has created lot of curiosity among the film goers. Although it has a routine story, the film makes sure that it reaches the expectations that it has created among the viewers prior its release. It is very good masala entertainer with superb performance and rich production values. Junior NTR has proved that he is the real Baadshah.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X