జూ ఎన్టీఆర్ ‘బాద్ షా’ ఆడియో ట్రాక్ లిస్ట్
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటిస్తున్న 'బాద్ షా' మూవీ ఆడియో మార్చి 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ బేనర్‌పై బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈచిత్ర ఆడియో ట్రాక్ లిస్టు వివరాలు బయటకు వచ్చాయి. ఏయే పాటలు ఉన్నాయో ఓ లుక్కేద్దాం.
1. సైరో సైరో...
2. బంతిపూల జానకి..
3. చలాకి పిల్లమ్మో...
4. డైమండ్ గర్ల్..
5. వెల్‌కం కనకం..
6. బాద్ షా టైటిల్ సాంగ్
'బాద్ షా' చిత్రం ఆడియోను వినూత్న రీతిలో విడుదల చేసేదుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ ఇంటిపై ఇటీవల ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆడియో వేడుక సాదాసీదాగా నిర్వహిస్తే ఆ ఎఫెక్టు వల్లనే ఇలా చేసారనే విమర్శలు వచ్చే అవకాశం ఉండటంతో, బాద్ షా ఆడియో వేడుక వినూత్న పద్దతిలో గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట.
దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











